KKR vs RCB: విరాట్ కోహ్లీకి భారీ జరిమానా మ్యాచ్ ఫీజులో 50 శాతం కట్

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బీసీసీఐ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. నిజానికి ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన తర్వాత పెద్ద వివాదం తలెత్తింది.

KKR vs RCB: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బీసీసీఐ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. నిజానికి ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన తర్వాత పెద్ద వివాదం తలెత్తింది.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు 1 పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఔట్ అయిన విధానం చర్చనీయాంశమైంది. థర్డ్ అంపైర్ ఇచ్చిన నో బాల్ వివాదం తర్వాత కోహ్లి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం ఇక్కడితో ముగియలేదు. బీసీసీఐ విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ తన తప్పును అంగీకరించాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం లెవల్ 1 నేరానికి విరాట్ కోహ్లీపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.

We’re now on WhatsAppClick to Join

ఆర్‌సిబి జట్టు ఇన్నింగ్స్‌లోని మూడో ఓవర్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో మొదటి బంతిని హై ఫుల్ టాస్‌గా వేశాడు. విరాట్ కోహ్లీ బంతిని కొట్టడానికి ప్రయత్నించాడు. షాట్ టైమింగ్ సరిగ్గా లేకపోవడంతో అది హర్షిత్ చేతుల్లోకి వెళ్లింది. కేకేఆర్ వెంటనే కోహ్లి వికెట్ అంటూ అప్పీల్ చేసింది. అయితే బంతి నడుము పై నుంచి వచ్చిందని కోహ్లీ భావించాడు. కాగా ఎంపైర్ నిర్ణయం తర్వాత కోహ్లి అంపైర్‌పై ఫైర్ అయ్యాడు. పెవిలియన్‌కు వెళుతుండగా విరాట్ కోహ్లీ బ్యాట్‌ను నేలకి కొడుతూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కనిపించాడు. దీంతో బిసిసిసి చర్యలు తీసుకుంది.

Also Read: Hyderabad : నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి