IND vs ENG: కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన కోహ్లీ అభిమాని

ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రోహిత్ శర్మకు అనుకోని సంఘటన ఎదురైంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

IND vs ENG: ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రోహిత్ శర్మకు అనుకోని సంఘటన ఎదురైంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓవైపు మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. నేరుగా రోహిత్ శర్మ దగ్గరకు పరుగెత్తి రోహిత్ కాళ్లకు నమస్కరించాడు.

తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ ఆ తర్వాత టెస్టులోకి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఇప్పటికే చెప్పింది. కోహ్లీ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయినప్పటికీ టీమిండియా ముఖ్యంగా రోహిత్ శర్మ కోసం క్రికెట్ అభిమానులు ఉప్పల్ స్టేడియానికి క్యూ కట్టారు. ఏఈ క్రమంలో విరాట్ కోహ్లీ పేరుతో స్టేడియం హోరెత్తింది. కోహ్లీ లేకున్నా మ్యాచ్‌కు హాజరైన అభిమానులు.. అతనిపై తమకు ఉన్న ప్రేమను వినూత్న రితీలో చాటుకున్నారు. కోహ్లీ నామస్మరణతో ఉప్పల్ స్టేడియాన్ని దద్దరిల్లించారు. ఇదిలా ఉండగా.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్‌ శర్మకు ఊహించని సంఘటన ఎదురైంది. రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేసేందుకు క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో ఓ అభిమాని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. రోహిత్‌ శర్మ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి రోహిత్‌ కాళ్ల మీదపడ్డాడు. దీంతో రోహిత్‌ అతన్ని పైకి లేపి..బయటికి వెళ్ళమని రిక్వెస్ట్ చేశాడు. ఈ సమయంలో సెక్యూరిటీ అక్కడికి చేరుకుని ఆ కుర్రాడిని గ్రౌండ్‌ బయటికి తీసుకెళ్లారు. అయితే రోహిత్ కాళ్ళమీద పడింది విరాట్ కోహ్లీ అభిమాని. రోహిత్‌ కాళ్లు మొక్కిన కుర్రాడు విరాట్‌ పేరుతో 18వ నంబర్‌ జెర్సీని ధరించాడు. కోహ్లీ అభిమాని అయి ఉండి.. రోహిత్‌ కాళ్లు మొక్కడం ద్వారా అందరు ఆశ్చర్యపడ్డారు.

రోహిత్ కాళ్ళు విరాట్ అభిమాని మొక్కడంతో వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. కోహ్లీ, రోహిత్ అభిమానులు వేర్వేరు కాదని, ఇద్దరూ ఆటను అభిమానిస్తారనడానికి ఈ ఘటన నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలంటూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునే అభిమానులు ఈ వీడియోను చూసి ఆలోచనలో పడ్డారు.

Also Read: Jamun Fruit : అల్ల నేరేడు పండ్లను ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త?