భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతోంది. సొంతగడ్డపై విండీస్ తో జరుగుతున్న సిరీస్ లో సెంచరీతో మళ్లీ ఫామ్ అందుకుటాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. తొలి రెండు వన్డేల్లోనూ కోహ్లీ తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. తొలి మ్యాచ్ లో 8 రన్స్ చేసిన విరాట్ రెండో వన్డేలో 18 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే రెండు మ్యాచ్ లలోనూ కోహ్లీ ఔటైన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా చిన్న షాట్లకే వికెట్ పారేసుకోవడం నిరాశ కలిగించింది. ఔట్ కాగానే.. పెవిలియన్‌కు తిరిగి వస్తున్న సమయంలో తనను తాను తిట్టుకోవడం కనిపించింది. కాగా ఈ మ్యాచ్ తో కోహ్లీ అరుదైన మైలురాయి అందుకున్నాజు, కోహ్లికి స్వదేశంలో ఇది 100వ వన్డే. వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 258 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ .. స్వదేశంలో 99 వన్డేలు ఆడగా… విండీస్ తో రెండో మ్యాచ్ తో 100 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇలా సొంతగడ్డపై 100 వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి కంటే ముందు 35 మంది ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా నుంచి కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, మహ్మద్ అజహారుద్దీన్, యువరాజ్ సింగ్‌లు ఉన్నారు.
ఈ మ్యాచ్ తో విరాట్హ కూడా వీరి సరసన చేరాడు. ఇక విరాట్ కోహ్లీ సొంతగడ్డపై ఆడిన 100మ్యాచ్‌ల్లో 60 సగటుతో 5020 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Virat Kohli : మైలురాయి మ్యాచ్ లో నిరాశపరిచిన కోహ్లీ

Kohli New