Site icon HashtagU Telugu

Virat Kohli: విరాట్ కోహ్లీ ముందు అరుదైన ఘ‌నత‌.. నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు!

Sports Lookback 2024

Sports Lookback 2024

Virat Kohli: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. వర్షం కారణంగా తొలిరోజు ఆట రద్దయింది. భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో అతను టెస్టులో 9 వేల పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంది. కోహ్లీ ఇప్పటివరకు 115 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 8947 పరుగులు చేశాడు. ఈ విధంగా తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసేందుకు 53 పరుగులు కావాలి. అలా చేయడంలో విరాట్ విజయం సాధిస్తే, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, గవాస్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కవచ్చు.

ఓవరాల్‌గా విరాట్‌ టెస్టుల్లో 9 వేలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 18వ బ్యాట్స్‌మెన్‌గా నిలవ‌నున్నాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 29 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు సాధించాడు. ఈ కాలంలో అతని అత్యుత్తమ స్కోరు 254. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ విరాట్‌ను ప్రశంసించాడు. అతని పరుగుల ఆకలి మునుపటిలానే ఉందని చెప్పాడు.

Also Read: IMD Cyclone Update: అల‌ర్ట్‌.. రాబోయే 3 రోజుల‌పాటు ఏపీలో భారీ వ‌ర్షాలే..!

టెస్టులో సచిన్ పేరిట అత్యధిక పరుగులు

సచిన్ 200 మ్యాచ్‌ల్లో 15921 పరుగులతో టెస్టు ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేశాడు. ఈ జాబితాలో ద్రవిడ్ 13265 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 163 టెస్టు మ్యాచ్‌లు ఆడి ఈ ఘనత సాధించాడు. గవాస్కర్ గురించి మాట్లాడుకుంటే అతను 125 టెస్ట్ మ్యాచ్‌లలో 10122 పరుగులు చేశాడు. ఇది కాకుండా బెంగళూరులో న్యూజిలాండ్‌పై కోహ్లీ 1000 పరుగులు కూడా పూర్తి చేయగలడు. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి 866 పరుగులు చేశాడు.

విరాట్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు

న్యూజిలాండ్‌పై 1,000 పరుగులకు చేరుకోవడానికి కోహ్లీకి 134 పరుగులు మాత్రమే అవసరం. కోహ్లి ఈ పని చేయగలిగితే అతను ఈ విషయంలో చెతేశ్వర్ పుజారా, వీరేంద్ర సెహ్వాగ్‌లను వెన‌క్కి నెట్ట‌గ‌ల‌డు. 2024లో కోహ్లీ పెద్దగా పరుగులు చేయలేదు. 16 మ్యాచ్‌ల్లో ఒక్కసారి మాత్రమే 50కి పైగా పరుగులు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో పేలవమైన ఫామ్‌ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాల‌ని కోహ్లీ భావిస్తున్నాడు.