Virat Kohli Retirement: విరాట్ సంచలన నిర్ణయం… టీ ట్వంటీలకు కోహ్లీ గుడ్ బై

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పాడు. టీ ట్వంటీ వరల్జ్ కప్ గెలిచిన వెంటనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. నిజానికి చాలా మంది కోహ్లీ టీ ట్వంటీ రిటైర్మెంట్ ను ముందే ఊహించారు. 2022 వరల్డ్ కప్ తర్వాత రెండేళ్ళ పాటు టీ ట్వంటీలు ఆడలేదు.

Published By: HashtagU Telugu Desk
Virat Kohli Retirement

Virat Kohli Retirement

Virat Kohli Retirement: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పాడు. టీ ట్వంటీ వరల్జ్ కప్ గెలిచిన వెంటనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. నిజానికి చాలా మంది కోహ్లీ టీ ట్వంటీ రిటైర్మెంట్ ను ముందే ఊహించారు. 2022 వరల్డ్ కప్ తర్వాత రెండేళ్ళ పాటు టీ ట్వంటీలు ఆడలేదు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతూ జాతీయ టీ ట్వంటీ టీమ్ కు మాత్రం దూరమయ్యాడు. అయితే వరల్డ్ కప్ కు ముందు మళ్ళీ టీ ట్వంటీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రపంచకప్ గెలవాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు జట్టులోకి వచ్చిన విరాట్ మెగా టోర్నీలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. సెమీస్ వరకూ అతను 75 పరుగులే చేయడం ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది.

అయితే కీలకమైన ఫైనల్లో మాత్రం విరాట్ అదరగొట్టేశాడు. ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లీ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ తో కలిసి మ్యాచ్ ను నిలబెట్టే ఇన్నింగ్స్ ఆడాడు. 76 పరుగులు చేసిన కోహ్లీ భారత్ భారీస్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన విరాట్ ఇదే తన చివరి అంతర్జాతీయ టీ ట్వంటీగా ప్రకటించాడు. వరల్డ్ కప్ గెలవడంతో తన కల నెరవేరిందన్నాడు. యువ ఆటగాళ్ళకు అవకాశమివ్వాల్సిన సమయం వచ్చిందని, అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. కాగా 2010లో జింబాబ్వేపై అంతర్జాతీయ టీ ట్వంటీల్లోకి అడుగుపెట్టిన కోహ్లీ తన కెరీర్ లో 125 మ్యాచ్ లు ఆడి 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. దీనిలో 1 సెంచరీ , 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పిన విరాట్ ఐపీఎల్ లో మాత్రం కొనసాగగనున్నాడు.

Also Read: T20 World Cup Final: సుధీర్ఘ నిరీక్షణకు తెర… టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత భారత్

  Last Updated: 30 Jun 2024, 12:27 AM IST