Virat Kohli: విరాట్ కోహ్లీ వయస్సు పెరుగుతున్న కొద్దీ రికార్డులను బద్దలు కొట్టే వేగం కూడా పెరుగుతోంది. వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. జనవరి 11న జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ 93 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 300 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కోహ్లీ 93 పరుగులు చేయగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 56 పరుగుల సహకారాన్ని అందించారు. వన్డే క్రికెట్‌లో కోహ్లీకి ఇది 45వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను గెలుచుకున్న ట్రోఫీలను తన దగ్గర ఉంచుకోనని ఆయన చెప్పారు.
Also Read: ప్యాక్స్ సిలికాలో భారత్ ప్రవేశం.. ప్యాక్స్ సిలికా అంటే ఏమిటి?
తన ఇంట్లో కాకపోతే ఆ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతారు?
కోహ్లీ ఆ రహస్యాన్ని బయటపెడుతూ ఇలా అన్నారు. నేను ఈ ట్రోఫీలను గుర్గావ్‌లో ఉన్న మా అమ్మ దగ్గరకు పంపిస్తాను. ఆమెకు ట్రోఫీలను సేకరించడం అంటే చాలా ఇష్టం. నా క్రికెట్ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఒక కల నిజమైనట్లుగా అనిపిస్తుంది. నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. ఈ స్థాయికి చేరుకోవడానికి నేను ఎంతో కష్టపడ్డాను అని కోహ్లీ పేర్కొన్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న వారి జాబితాలో కోహ్లీ ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్నారు.
- సచిన్ టెండూల్కర్: 62 సార్లు
- సనత్ జయసూర్య: 48 సార్లు
- విరాట్ కోహ్లీ: 45 సార్లు
