Site icon HashtagU Telugu

Kohli Joins Team India: లండన్ నుంచి చెన్నైకు, కేంద్రమంత్రి స్థాయి భద్రత

Kohli Joins Team India

Kohli Joins Team India

Kohli Joins Team India: శ్రీలంకతో వన్డే సిరీస్ తర్వాత లండన్ వెళ్లిన కింగ్ కోహ్లీ బంగ్లాదేశ్‌ టెస్ట్ (IND vs BAN)సిరీస్ కోసం ఇండియా వచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ చెన్నై శిబిరంలో చేరాడు. తొలి టెస్టుకు వారం రోజుల ముందు చెన్నైలో టీమ్ ఇండియా శిక్షణ శిబిరం నిర్వహిస్తుంది. విరాట్ కోహ్లి (Virat Kohli) చెన్నై విమానాశ్రయం నుండి భారీ భద్రత నడుమ టీమ్ హోటల్‌కు చేరుకున్నాడు. ఈ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

విరాట్‌ చుట్టూ CISF జవాన్లతో పాటు, సీనియర్ స్థానిక పోలీసు అధికారులతో హోటల్ కు వెళ్తుండగా కోహ్లీ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరాట్‌కు కేంద్ర మంత్రి స్థాయి భద్రత కల్పించారు. కాగా కోహ్లీ దాదాపు 8 నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. దీంతో కోహ్లీ టెస్ట్ క్రికెట్ని చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చుస్తున్నారు. విరాట్ కోహ్లీ టెస్టు, వన్డే, టీ20 సహా 591 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 26,942 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో మరో 58 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. తదుపరి 8 ఇన్నింగ్స్‌ల్లో 58 పరుగులు చేస్తే, 600 ఇన్నింగ్స్‌ల్లో 27,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కుతాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తర్వాత కుమార సంగక్కర మరియు రికీ పాంటింగ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 పరుగులు పూర్తి చేశారు. 623 ఇన్నింగ్స్‌లలో సచిన్ 27,000 పూర్తి చేసాడు. సచిన్ టెండూల్కర్ 782 ఇన్నింగ్స్‌ల్లో 100 సెంచరీలతో 34357 పరుగులు, కుమార సంగక్కర 666 ఇన్నింగ్స్‌ల్లో 63 సెంచరీలతో 28,016 పరుగులు, రికీ పాంటింగ్ 668 ఇన్నింగ్స్‌ల్లో 71 సెంచరీలతో 27,483 పరుగులు చేశారు.

Also Read: Amrapali Kata : హైడ్రా అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆగ్రహం