Site icon HashtagU Telugu

Virat Kohli Diet : విరాట్ కోహ్లీ డైట్ ప్లాన్.. ఏం తింటాడు ? ఏం తినడు ?

Virat Kohli Diet Favorite Foods

Virat Kohli Diet : విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడని తెలిసి..  చాలామంది ఆయన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే ఇన్నాళ్ల పాటు టెస్ట్ క్రికెట్‌లో చాలా చక్కటి ఆటతీరును విరాట్ కనబరిచారు. ఆయనను ఫ్యూచర్‌లో మిస్ కాబోతున్నామనే ఎమోషన్ ఫ్యాన్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్న కింగ్‌గా కోహ్లీ అవతరించారు. నిత్యం ఫుల్ ఫిట్‌నెస్‌తో ఉండే విరాట్ డైట్ ఎలా ఉంటుంది ? ఏమేం తింటారు ? ఏమేం తినరు ? ఈ కథనంలో తెలుసుకుందాం..

విరాట్ ఏం తింటారు ? ఏం తినరు ? 

  • విరాట్ కోహ్లీ (Virat Kohli Diet) జున్ను, పాలు, కారంగా ఉండే ఆహారాలు వంటి ఫుడ్స్‌ను తన మెనూ నుంచి పూర్తిగా తొలగించారు.
  • ఉడికించిన కూరగాయలను, వీలైనంత తక్కువ మసాలాలతో విరాట్ కోహ్లీ తింటారు. ఈ కూరగాయలకు ఉప్పు, కారం, నిమ్మకాయ మాత్రమే కలుపుతారు.
  • బరువు తగ్గాలన్నా.. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం సమస్య పోవాలన్నా.. ఉడికించిన కూరగాయలను తినడం బెటర్.
  • ఉడికించిన కూరగాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అవి సులభంగా జీర్ణమవుతాయి. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
  • ఉడికించిన కూరగాయలు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  • గోధుమ ఉత్పత్తులలో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది. అందుకే వాటిని విరాట్ తినరు.
  • పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులను విరాట్ అస్సలు ముట్టుకోరు.
  • కోహ్లీకి ముఖ్యంగా రాజ్మా, లోబియా వంటి బీన్స్ అంటే చాలా ఇష్టం.
  • గ్రిల్డ్ సలాడ్‌ను ఆలివ్ నూనెతో తినడానికి విరాట్ ఇష్టపడతారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషణను అందిస్తుంది.
  • విరాట్ కోహ్లీ తన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతాడు. రోజంతా పుష్కలంగా నీళ్లు తాగుతాడు.
  • నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని విరాట్ తీసుకుంటాడు. దోసకాయ, పుచ్చకాయ వంటి పండ్లను తింటాడు. వీటివల్ల కండర శక్తి  పునరుద్ధరణ సులభంగా జరుగుతుంది.
  • 2017 సంవత్సరం వరకు విరాట్ కోహ్లీ మాంసాహారి. అయితే ఇప్పుడు ఆయన నాన్-వెజ్ ఫుడ్స్ ముట్టుకోడు.
  • విరాట్ తినే ఆహారంలో 90 శాతాన్ని తేలికగా ఆవిరిలో వేయిస్తారు.
  • విరాట్ కోహ్లీ ఫైబర్ కోసం ఆకుపచ్చ కూరగాయలు తింటాడు. తక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్లను తీసుకుంటాడు.
  • విరాట్ కోహ్లీ ప్రోటీన్ కోసం కిడ్నీ బీన్స్, పప్పు ధాన్యాలు తింటాడు.