Kohli Declines Captaincy: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Kohli Declines Captaincy) చాన్నాళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీలో భాగంగా కోహ్లీ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ఢిల్లీ జనవరి 30 నుంచి రైల్వేస్‌తో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే మెడ నొప్పి కారణంగా సౌరాష్ట్రతో జరిగిన మొదటి మ్యాచ్‌కు కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అతను పూర్తిగా ఫిట్నెస్ సాధించినట్లు బీసీసీఐ పేర్కొంది. దీంతో విరాట్ రంజీ ఆడేందుకు సిద్దమయ్యాడు.
కోహ్లీపై ఉన్న అభిమానం కారణంగా ఢిల్లీ క్రికెట్ బోర్డు కోహ్లీకి సారధ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది. కానీ కోహ్లీ ఆటపై మాత్రమే ద్రుష్టి పెట్టాలని అనుకున్నాడు. కెప్టెన్సీ పగ్గాలు చేపడితే తన ఆటకు ఆటంకం కలిగే అవకాశం ఉందని కింగ్ భావించి కెప్టెన్సీని సున్నితంగానే తిరస్కరించినట్లు సమాచారం. మరోవైపు రోహిత్ శర్మ ఇప్పటికే రంజీలోకి ప్రవేశించాడు. కానీ శర్మ ఆటలో ఎలాంటి మార్పు కనిపించలేదు. జమ్మూకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మన్ తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ 2 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 28 పరుగులు చేశాడు. ఓ దశలో రోహిత్ బ్యాటింగ్ చూసి ఫ్యాన్స్ తబ్బుబ్బిపోయారు. కానీ రోహిత్ మరోసారి నిరాశపరుస్తూ 28 పరుగులకే ఇన్నింగ్స్ ముగించేశాడు.ఇకపోతే విరాట్ కోహ్లీ కూడా బ్యాడ్ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. పెర్త్ వేదికగా సెంచరీ చేసినప్పటికీ ఆ దూకుడును కొనసాగించలేకపోయాడు. 5 మ్యాచ్‌ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read: Mohammed Siraj Dating: బాలీవుడ్ సింగర్‌తో సిరాజ్ డేటింగ్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చేజారడానికి రోహిత్, కోహ్లీలే కారణమన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ ఆటగాళ్లకు కీలక ఆదేశాలిచ్చింది. అంతర్జాతీయ ఆటగాళ్లందరూ దేశవాళీలో పాల్గొనాలని తేల్చి చెప్పింది. దీంతో కోహ్లీ, రోహిత్ దాదాపు పదేళ్ల తర్వాత రంజీలో ఆడేందుకు సిద్ధమయ్యారు. విరాట్.. రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, రవీంద్ర జడేజాతో సహా దాదాపు అందరు స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం రంజీ ఆడుతున్నారు.