Site icon HashtagU Telugu

Yuzvendra Chahal: విరాట్ కోహ్లీని బాత్‌రూమ్‌లో ఏడ‌వ‌టం చూశా.. చాహ‌ల్ వీడియో వైర‌ల్‌!

Yuzvendra Chahal

Yuzvendra Chahal

Yuzvendra Chahal: భారత క్రికెటర్ యుజవేంద్ర చాహల్ (Yuzvendra Chahal) ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కీల‌క విష‌యాలు వెల్లడించాడు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్ ఓటమి తర్వాత బాత్‌రూమ్‌లో బిగ్గరగా ఏడుస్తూ చూశానని చాహల్ తెలిపాడు. సాధారణంగా మైదానంలో ఎంతో దూకుడుగా ఉండే కోహ్లీ, తన భావోద్వేగాలను బయటకు చూపించడు. కానీ, ఆ ఓటమి అతన్ని తీవ్రంగా బాధించిందని చాహల్ మాటలు తెలియజేస్తున్నాయి.

కోహ్లీని ఏడుస్తూ చూసిన సందర్భం

రాజ్ షమానీతో జరిగిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురైన విషయాన్ని హోస్ట్ ప్రస్తావించాడు. దీనికి ముందు ఎప్పుడైనా కోహ్లీని ఏడ్వడం చూశారా అని అడగ్గా? చాహల్ 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.

“2019 ప్రపంచ కప్‌లో మేము న్యూజిలాండ్‌తో ఓడిపోయాక, నేను అతనిని బాత్‌రూమ్‌లో ఏడుస్తూ చూశాను. నేను చివరిలో బ్యాటింగ్‌కు వెళ్ళేటప్పుడు అతని పక్కనుంచి వెళ్ళాను. అప్పుడు అతని కళ్ళలో నీళ్లు ఉన్నాయి. ఆ రోజు నేను బాత్‌రూమ్‌లో చాలా మందిని ఏడుస్తూ చూశాను” అని చాహల్ వివరించాడు. ఆ ఓటమి భారత జట్టు సభ్యులందరినీ ఎంతగానో నిరాశపరిచిందని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read: PM Kisan : పీఎం కిసాన్‌ నిధుల విడుదల.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!

కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీపై చాహల్ వ్యాఖ్యలు

ఇదే ఇంటర్వ్యూలో యుజవేంద్ర చాహల్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీ శైలి మధ్య ఉన్న తేడాలను ప్రస్తావించాడు. విరాట్ కోహ్లీ మైదానంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తాడని, రోహిత్ శర్మ స్వభావం భిన్నంగా ఉంటుందని పేర్కొన్నాడు.

ఇద్దరి కెప్టెన్సీపై తన అభిప్రాయాన్ని చాహల్ పంచుకుంటూ.. “రోహిత్ భయ్యా మైదానంలో తనను తాను ఎలా ప్రశాంతంగా ఉంచుకుంటారో నాకు చాలా ఇష్టం. అతను చాలా మంచి కెప్టెన్. ఇక విరాట్ భయ్యా తనతో ఒక అద్భుతమైన శక్తిని మైదానంలోకి తీసుకువస్తాడు. ఆ శక్తి ఎల్లప్పుడూ పైకి వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడూ తగ్గదు,” అని ప్రశంసించాడు.