Virat Kohli Creates T20 History : టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన కోహ్లీ

ఇప్పటివరకు భారత్‌ నుంచి ఏ బ్యాట్స్‌మెన్ నెలకొల్పని రికార్డు ను కోహ్లీ తన పేరిట నెలకొల్పి సరికొత్త రికార్డు (Virat Kohli Record) సృషించాడు

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 10:53 PM IST

స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్-2024 (IPL-2024) తొలి మ్యాచ్‌లోనే సంచలన రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు భారత్‌ నుంచి ఏ బ్యాట్స్‌మెన్ నెలకొల్పని రికార్డు ను కోహ్లీ తన పేరిట నెలకొల్పి సరికొత్త రికార్డు (Virat Kohli Record) సృషించాడు. ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్‎లో బెంగుళూరు -చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RCB) జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 6 పరుగులు చేసి తన పేరిట ఓ పెద్ద రికార్డు సృష్టించాడు. కోహ్లీ టీ20 క్రికెట్‌లో 12000 పరుగులు పూర్తి చేశాడు (అంతర్జాతీయ + డొమెస్టిక్ T20 + ఫ్రాంచైజ్ లీగ్). ఇంతకు ముందు టీ20 క్రికెట్‌లో కేవలం 5 మంది బ్యాట్స్‌మెన్ మాత్రమే 12000 పరుగులను అధిగమించగలిగారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులు సునామీ సృష్టించిన ఈ ప్లేయర్.. రెండు నెలల తర్వాత గ్రౌండ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి అరుదైన రికార్డు సాధించడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మ్యాచుకు ముందు వరకు కోహ్లీ టీ20ల్లో 11994 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (11,156) రెండో స్థానంలో ఉన్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక టీ20లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్ లిస్ట్ చూస్తే..

క్రిస్ గేల్ – 14,562 పరుగులు
షోయబ్ మాలిక్ – 13360 పరుగులు
కీరన్ పొలార్డ్ – 12900 పరుగులు
అలెక్స్ హేల్స్ – 12319 పరుగులు
డేవిడ్ వార్నర్ – 12065 పరుగులు
విరాట్ కోహ్లీ – 12000+ పరుగులు

అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 12000 టీ20 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్ లిస్ట్ చూస్తే..
345 ఇన్నింగ్స్‌లు – క్రిస్ గేల్
360 ఇన్నింగ్స్‌లు – విరాట్ కోహ్లీ
368 ఇన్నింగ్స్‌లు – డేవిడ్ వార్నర్
432 ఇన్నింగ్స్‌లు – అలెక్స్ హేల్స్
451 ఇన్నింగ్స్‌లు – షోయబ్ మాలిక్
550 ఇన్నింగ్స్‌లు – కీరన్ పొలార్డ్

ఇక ఐపీఎల్ 2024 మొదటి మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనుజ్ రావత్ (25 బంతుల్లో 48), దినేశ్ కార్తిక్ (26 బంతుల్లో 38), ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 35), విరాట్ కోహ్లీ (21) రాణించారు. చెన్నై (CSK) బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4 వికెట్లతో సత్తాచాటాడు. దీపక్ చాహర్ 1 వికెట్ పడగొట్టాడు.

Read Also : 6th Class Student Letter : ‘బార్‌’ ను తీసేయాలంటూ హైకోర్టుకు ఆరో తరగతి విద్యార్థిని లేఖ..