Site icon HashtagU Telugu

Virat: వంద టెస్టులు ఆడతానని అనుకోలేదు

virat kohli

virat kohli

మొహాలీ వేదికగా శుక్రవారం భారత్‌-శ్రీలంక మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. అయితేఈ టెస్ట్‌ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కెరీర్‌లో వందో టెస్ట్‌ మ్యాచ్‌ కావడం విశేషం..ఈ క్రమంలోనే టీమిండియా తరఫున 100 టెస్టులాడిన 12వ ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. ఇక 2011 జూన్లో వెస్టిండీస్పైజరిగిన టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ తన తొలి టెస్టు సెంచరీని 2012 జనవరిలో ఆస్ట్రేలియాపై సాధించాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 99 టెస్టుల్లో 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. అందులో 27 సెంచరీలు , 28 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.. ఈ ఫార్మాట్లో కోహ్లీ అత్యధిక స్కోరు 254.

ఇక విరాట్ కోహ్లి వందో టెస్టు ఆడనున్న నేపథ్యంలో బీసీసీఐ కోహ్లికి శుభాకాంక్షలు చెబుతూ ఒక వీడియోనూ విడుదల చేసింది. ఆ వీడియోలో కోహ్లి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన కెరీర్ లో 100 టెస్టు మ్యాచ్‌లు ఆడుతానని కలలో కూడా అనుకోలేదన్నాడు. క్రికెట్‌లోకి అడుగుపెట్టడానికి ముందే ఒక బ్యాటర్ గా చిన్నచిన్న స్కోర్లు చేయకూడదని తనకు తానే చెప్పుకున్నానని తెలిపాడు. ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాననీ గుర్తు చేసుకున్నాడు. రానున్న రోజుల్లోనూ తన శక్తిమేర రాణించేందుకు కృషి చేస్తానని కోహ్లీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు… ఇదిలాఉంటే విరాట్ కోహ్లీ టీంఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించింది. దీంతో అత్యంత విజయవంతమైన భారత్ కెప్టెన్ల జాబితాలో కోహ్లీ కూడా నిలిచాడు. కాగా భారత్ తరపున వంద టెస్టుల ఆడిన 12వ ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.

Exit mobile version