ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లి 53 బంతుల్లో6 ఫోర్లు, సిక్స్ సాయంతో 58 పరుగులు , రజత్ పటిదార్ 32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 52 పరుగులు చేసి అర్ధ సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సాంగ్వాన్ 2 , షమీ, జోసఫ్, ఫెర్గుసన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
అయితే ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 15 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల తర్వాత విరాట్ కోహ్లీకి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో ఓ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఇక చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడంతో సహచర ఆటగాళ్లతో పాటుగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ జట్టు ఓ చెత్త రికార్డును కూడా సాధించింది. ఈ సీజన్‌లో ఒక జట్టు తరపున టాప్-3 బ్యాట్స్‌మెన్ ఎక్కువసార్లు డకౌట్ అయిన జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. ఈ ఐపీఎల్ లో ఆర్సీబీ టాప్-3 బ్యాట్స్‌మెన్లు ఆరుసార్లు డకౌట్ గా పెవిలియన్ చేరారు. వీరిలోయువ ఆటగాడు అనూజ్ రావత్ మూడుసార్లు డకౌట్ అవగా.. విరాట్ కోహ్లి రెండుసార్లు, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఒకసారి డకౌట్ అయ్యారు.
Virat Kohli half century today. pic.twitter.com/d24tXYH5Au
— Shivam Thakur (@ShivamT95251517) April 30, 2022