Site icon HashtagU Telugu

Virat Kohli London House: టీమిండియా ఆట‌గాళ్ల‌కు లండ‌న్‌లో విందు ఏర్పాటు చేసిన విరాట్ కోహ్లీ!

Virat Kohli London House

Virat Kohli London House

Virat Kohli London House: భారత్- ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జూన్ 20న హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కొత్త నాయకత్వంతో కూడిన భార‌త్ జట్టు ఇంగ్లాండ్‌కు బయలుదేరింది. సిరీస్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ తన లండన్‌లోని (Virat Kohli London House) ఇంట్లో టీమ్ ఇండియా ఆటగాళ్లకు విందు ఏర్పాటు చేశాడని వార్తలు వ‌స్తున్నాయి. కొంతమంది ఆటగాళ్లను మాత్రమే విరాట్ తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడని, అందులో టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌ రిషభ్ పంత్ కూడా ఒకరని తెలుస్తోంది.

సమాచారం ప్రకారం.. సోమవారం సాయంత్రం కొంతమంది ఆటగాళ్లు విరాట్ కోహ్లీ లండన్‌లోని ఇంటికి చేరుకున్నారు. వారిలో మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, రిషభ్ పంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో కఠినమైన సిరీస్ ప్రారంభం కాకముందు విరాట్ టీమ్ ఇండియా ఆటగాళ్లకు కీలక సలహాలు ఇవ్వాలని భావిస్తున్నాడని అనుకోవచ్చు. అయితే కెప్టెన్ శుభమన్ గిల్ ఈ విందులో పాల్గొన్నాడా లేదా అనేదానిపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు.

Also Read: Big Bash League: బిగ్ బాష్ లీగ్ కోసం విరాట్ కోహ్లీ స్నేహితుడు నామినేష‌న్‌!

విరాట్ కోహ్లీ తొలి ఇంగ్లాండ్ టూర్‌లో విఫలం

విరాట్ కోహ్లీ తన మొదటి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ టూర్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఆ టూర్‌లో అతను 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 134 రన్స్ మాత్రమే చేశాడు. అతని గరిష్ఠ స్కోరు 39 రన్స్. అయితే 2018లో అతను ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లినప్పుడు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ వంటి దిగ్గజ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 2018 ఇంగ్లాండ్ టూర్‌లో విరాట్ 10 ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలతో సహా 593 రన్స్ సాధించాడు. బహుశా ఇదే కారణంగా విరాట్ తన యువ సహచరులకు ఇంగ్లాండ్ టూర్‌లో ఎదురయ్యే సవాళ్ల గురించి వివరించి, సలహాలు ఇచ్చి ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

భారత జట్టు సన్నాహాలు

భారత జట్టు సన్నాహాలను సిద్ధం చేసుకోవడానికి జూన్ 6నే ఇంగ్లాండ్‌కు బయలుదేరింది. జూన్ 13 నుంచి ఇండియా వర్సెస్ ఇండియా A ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడారు. ఇందులో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన శతకం సాధించాడు.