Virat Kohli: ఐసీసీ వరల్డ్‌కప్‌లో భారత్ తన రెండో మ్యాచ్‌లో బుధవారం.. అఫ్ఘానిస్థాన్‌ను చిత్తు చేసింది. 273 పరుగుల లక్ష్యాన్ని మరో 15 ఓవర్లు ఉండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఛేజింగ్‌లో భారత్ కెప్టెన్, ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగిపోయాడు. 84 బంతుల్లోనే 131 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించాడు. ఇదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (55 నాటౌట్) మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో మరో రికార్డు అందుకున్నాడు కోహ్లీ.
ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో ఇప్పటి వరకు 67 మ్యాచ్‌లు ఆడి 2311 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 61 మ్యాచ్‌ల్లో 2278 పరుగులు, కుమార సంగక్కర 2193 రన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐసీసీ టోర్నీల్లో బెస్ట్ యావరేజ్ కలిగిన ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీనే కావడం విశేషం. వన్డే ప్రపంచకప్‌లో 50.86 సగటుతో పరుగులు చేసిన విరాట్.. టీ20 ప్రపంచకప్ 81.50 యావరేజ్‌తో బ్యాటింగ్ చేశాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 88.16 సగటుతో రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్ల ఐసీసీ టోర్నీలో 50+ యావరేజ్ ఉన్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ కావడం విశేషం.
కోహ్లీతో గొడవపై నవీన్ ఉల్ హక్ స్పందించాడు. ఇన్నాళ్లు తమ ఇద్దరి మధ్య జరిగిన గొడవకు ఎండ్ కార్డ్ వేశామని తెలిపాడు. ఇక మీదట తాము మంచి ఫ్రెండ్స్‌గా ఉంటామన్నాడు. మ్యాచ్ తర్వాత ఈ విషయంపై రియాక్ట్ అయిన నవీన్.. తాను, కోహ్లీ కలసిపోయామని చెప్పాడు. విరాట్ గ్రేట్ ప్లేయర్ అని.. తామిద్దరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నామన్నాడు. గ్రౌండ్లో ఏది జరిగినా అది గ్రౌండ్ లోపలకే పరిమితమన్నాడు. బయట తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని నవీన్ ఉల్ హక్ క్లారిటీ ఇచ్చాడు.