Site icon HashtagU Telugu

RR vs RCB: కోహ్లీ వీరోచిత పోరాటం.. భారీ సెంచరీ

RR vs RCB

RR vs RCB

RR vs RCB: జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్ కింగ్ కోహ్లీ వీరోచిత బ్యాటింగ్ తో అలరించాడు. రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ సెంచరీ నమోదు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరుపున మొదటి సెంచరీ కోహ్లీ బ్యాట్ నుంచే నమోదవ్వడం విశేషం. ఇన్నింగ్స్ లో విరాట్ 12 ఫోర్లు, 4 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగి 113 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.

విరాట్ కోహ్లి తన ఇన్నింగ్స్‌ను అట్టహాసంగా ప్రారంభించాడు. రెండో ఓవర్‌లో నాంద్రే బెర్గర్‌పై రెండు ఫోర్లు కొట్టి కోహ్లి విధ్వంసం షురూ చేశాడు. ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్ మరియు అవేష్ ఖాన్‌ బౌలింగ్లో పరుగుల వరద పారించాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌ కోహ్లీ అర్ధం సెంచరీ పూర్తి చేశాడు. రియాన్ పరాగ్ వేసిన ఈ ఓవర్లో భారీ సిక్సర్ తో కోహ్లీ ఈ సీజన్లో తన మూడవ అర్ద సెంచరీని పూర్తి చేశాడు. ఇక ఫిఫ్టీ కంప్లీట్ చేసిన తర్వాత విరాట్ మరింత రెచ్చిపోయాడు. ఈ క్రమంలో రాజస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్నాడు. 72 బంతుల్లో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లి బ్యాటింగ్ ముందు రాజస్థాన్ బౌలర్లు పూర్తిగా నిస్సహాయంగా కనిపించారు.

రాజస్థాన్ రాయల్స్‌పై ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 62 పరుగులు చేసిన వెంటనే శిఖర్ ధావన్‌ను అధిగమించాడు. రాజస్థాన్ పై కోహ్లీ ఇప్పటివరకు 732 పరుగులు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు రాజస్థాన్‌పై 679 పరుగులు చేసిన గబ్బర్ పేరిట ఉంది. ధావన్ తర్వాత 652 పరుగులు చేసిన ఎబి డివిలియర్స్ పేరిట ఉంది.

We’re now on WhatsAppClick to Join

ఇక విరాట్ కోహ్లీకి, ఫాఫ్ డు ప్లెసిస్ నుండి కూడా పూర్తి మద్దతు లభించింది. ఫాఫ్ నిదానంగా ఆరంభించినా క్రీజులో స్థిరపడిన తర్వాత డు ప్లెసిస్ రాజస్థాన్ బౌలర్లను టార్గెట్ చేశాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఒకే ఓవర్‌లో ఫాఫ్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. కోహ్లి, ఫాఫ్‌లు తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.

Also Read: Siddharth & Aditi Rao : ఎట్టకేలకు అదితిరావును పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సిద్దార్థ్