Kohli Breaks Wall: కోహ్లీ స్ట్రోక్ కి చెపాక్ స్టేడియంలో పగిలిన గోడ

Kohli Breaks Wall: ప్రాక్టీస్ మ్యాచ్ లో కోహ్లీ ఆడిన విధానం చూస్తే సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుకు అతను ఎలాంటి కండిషన్ ఇవ్వబోతున్నాడో మీరే ఊహించవచ్చు

Published By: HashtagU Telugu Desk
Kohli Breaks Wal

Kohli Breaks Wal

Kohli Breaks Wall: బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ కోసం చెన్నై చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్‌లో భారత జట్టు చెమటోడ్చింది. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన షాట్ చర్చనీయాంశమైంది. కోహ్లీ బాదిన ఈ బుల్లెట్ షాట్ డ్రెస్సింగ్ రూమ్ సమీపంలో గోడను బద్దలు కొట్టింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చెన్నైలో నిర్వహిస్తున్న ప్రాక్టీస్ క్యాంపులో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ భాగమయ్యాడు. ప్రాక్టీస్‌లో అద్భుత ఫామ్‌లో కనిపించాడు. ఫోర్లు సిక్సర్లతో తన పాత రోజుల్ని గుర్తు చేశాడు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా బంగ్లా బౌలర్లకు ప్రమాద హెచ్చరికలు పంపాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో కోహ్లీ ఆడిన విధానం చూస్తే సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుకు అతను ఎలాంటి కండిషన్ ఇవ్వబోతున్నాడో మీరే ఊహించవచ్చు.

బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డులు చాలా బాగున్నాయి. ఇప్పటివరకు అతను బంగ్లాదేశ్‌తో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడాడు, అందులో 9 ఇన్నింగ్స్‌లలో 54.63 సగటుతో 437 పరుగులు చేశాడు. ఈ సమయంలో 2 సెంచరీలు కూడా చేశాడు. అతని అత్యధిక స్కోరు 204 పరుగులు. దీంతో బంగ్లాపై కోహ్లీ ఏ విధంగా లేచిపోతాడో చూడాలి.భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. భారత జట్టు చెన్నైలో ప్రాక్టీస్ చేస్తుండగా, బంగ్లాదేశ్ జట్టు కూడా ఆదివారం భారత్‌కు వచ్చింది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. హెడ్-టు-హెడ్ టెస్ట్ గణాంకాలు చూస్తే.. భారత్‌దే పైచేయి. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 13 మ్యాచ్‌లు జరగ్గా ఇందులో భారత్ 11 మ్యాచ్‌లు గెలవగా, 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

Also Read: Bengal govt : మరోసారి డాక్టర్లకు బెంగాల్‌ ప్రభుత్వం పిలుపు

  Last Updated: 16 Sep 2024, 01:39 PM IST