Site icon HashtagU Telugu

Kohli Blasted: కోహ్లీ అంత రెచ్చిపోవడం అవసరమా..? విమర్శిస్తున్న నెటిజన్లు..!!

Kohli Dhoni Abuse

Kohli Dhoni Abuse

విరాట్ కోహ్లీ ఈ మధ్య కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. అనవసరపు విమర్శలను కొనితెచ్చుకుంటున్నారు. బుధవారం నాడు చెన్నె సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ప్రవర్తనపై నెటిజన్లు…చెన్నైసూపర్ కింగ్స్ అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. ఆటలో భాగంగా జోష్ హేజిల్ వుడ్ వేసిన బాల్ కు ధోని అవుటయ్యారు. దీంతో విరాట్ కోహ్లీ రెండు చేతులు పిడికిలి బిగించి…పళ్లు బిగపట్టి గట్టి అరిసారు. మాజీ కెప్టెన్ కు…మరో మాజీ కెప్టెన్ ఇచ్చే గౌరవం ఇదా అంటూ నెటిజన్లు కోహ్లీని ఏకిపారేస్తున్నారు.

అయితే ఈ సీజన్ లో కోహ్లీ ఒక మ్యాచ్ లో అర్థశతకం తప్పా…పెద్దగా రాణించింది లేదు. అలాంటి ఆటగాడు ఇలా వ్యవహరించడం విమర్శలకు తావునిస్తుంది. ఆమోదనీయం కాదు…భారత ఆర్మీ ఉద్యోగిని విమర్శిస్తున్నాడు…విరాట్ కోహ్లీ జాతి వ్యతిరేకుడని తెలుసు అంటూ సర్ దిండా అనే యూజర్ కామెంట్ పెట్టాడు.

విరాట్ కోహ్లీ వికెట్ పడిన తర్వాత…ధోని వికెట్ తర్వాత సన్నివేశాలను చూస్తే వ్యత్యాసం ఇట్టే తెలుస్తుంది. ఒక విరాట్ ఫ్యాన్ గా అతడి నుంచి ఈ రకమైన ప్రవర్తనను అస్సలు ఊహించలేదు. ఇలాంటి ప్రవర్తనతో కాకుండా సెటబ్రేట్ చేసుకోవాల్సింది. క్రికెట్ లో ప్రవర్తన ముఖ్యమని రాహుల్ అనే యూజర్ కామెంట్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఓటమితో చెన్నైసూపర్ కింగ్స్ ఈ సీజన్ ను నిష్ర్కమించినట్లే. పది మ్యాచులు అడితే…గెలిచింది మూడింటిలోనే. మిగిలిన నాలుగింటిలో గెలిచినా…ఏడు విజయాలతో 14 పాయింట్లకు చేరుతుంది. అది అసాధ్యంగానే కనిపిస్తోంది.