Virat Kohli @50mn Followers:ఆఫ్ ది ఫీల్డ్ లో కోహ్లీ మరో రికార్డ్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రన్‌ మెషిన్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు వచ్చి చేరాయి.

  • Written By:
  • Updated On - September 13, 2022 / 04:54 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రన్‌ మెషిన్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు వచ్చి చేరాయి. కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లకు గుండెల్లో దడే.. ప్రస్తుతం ఫామ్‌లో లేకున్నా… కొన్నేళ్ళుగా అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగే సీరీస్ కోసం రెడీ అవుతున్నాడు.

కాగా ఆఫ్ ది ఫీల్డ్‌లో కోహ్లీ మరో కొత్త రికార్డు సృష్టించాడు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటమే కాకుండా.. తన లైఫ్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాడు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లోనూ, ట్విట్టర్ లో కోహ్లీకి ఫాలోవర్లు విపరీతంగా ఉన్నారు. తాజాగా విరాట్ ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు. ట్విట్టర్‌లో 50 మిలియన్ల ఫాలోవర్లను పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు.భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ట్విట్టర్‌లో 20.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా మహేంద్ర సింగ్ ధోనీ ట్వి్ట్టర్ ఫాలోవర్ల సంఖ్య 8.4 మిలియన్లు. వీరందరికీ చాలా ముందున్న విరాట్ కోహ్లీ… ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్‌లో కలిపి 310 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. గతంలోనే
ఇన్‌స్టా గ్రామ్‌లో కోహ్లీ ఫాలోవర్స్‌ సంఖ్య 200 మిలియన్లు దాటిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్లున్న అథ్లెట్లలో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. విరాట్ కంటే ముందు ఫుట్ బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ ఉన్నారు. రొనాల్డో 450 మిలియన్ల మంది, మెస్సీ 333 మిలియన్ల ఫాలోవర్లతో టాప్-2 స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే ఆసియాలో మాత్రం కోహ్లీనే టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు.