Site icon HashtagU Telugu

Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ఘనత సాధించిన విరాట్ కోహ్లీ

Virat Kohli

Resizeimagesize (1280 X 720) (3) 11zon (1)

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఆదివారం అంతర్జాతీయ క్రికెట్‌లో తన పేరిట మరో పెద్ద ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో ఢిల్లీ టెస్టులో భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 25 వేల పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 44, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేశాడు. అత్యంత వేగంగా 25,000 పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ విషయంలో విరాట్ గ్రేట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.

కోహ్లీ తన 549వ ఇన్నింగ్స్‌ల్లో ఈ సంఖ్యను తాకాడు. మరోవైపు, సచిన్ టెండూల్కర్ దీని కోసం 577 మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 588 పరుగులు, దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ 594, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 608, మహేల జయవర్ధనే 701 మ్యాచ్‌ల్లో 25,000 పరుగులు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 25000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 25000 పరుగులు పూర్తి చేశాడు. విరాట్ భారత్‌లో రెండో బ్యాట్స్‌మెన్‌గానూ, ప్రపంచంలో ఆరో బ్యాట్స్‌మెన్‌గానూ నిలిచాడు.

Also Read: IND vs AUS: టీమిండియానే ఫిరోజ్ ”షా”.. రెండో టెస్టులోనూ ఆసీస్ చిత్తు

విశేషమేమిటంటే.. అత్యల్ప 549 ఇన్నింగ్స్‌ల్లో 53.7 సగటుతో అంతర్జాతీయ క్రికెట్‌లో 25000 పరుగులు పూర్తి చేసిన కోహ్లీ, దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 25 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. తన రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ 31 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. అతను టాడ్ మర్ఫీ ద్వారా స్టంప్ అవుట్ అయ్యాడు.

ఆదివారం రాజధాని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కింగ్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్‌లో, నాథన్ లియాన్ వేసిన ఓవర్ తొలి బంతిని లాంగ్ ఆన్‌లో కొట్టిన కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో తన 25,000 పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా దాటేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 25000 పరుగుల మార్క్‌ను దాటిన రెండో భారత క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ 782 ఇన్నింగ్స్‌ల్లో 48.5 సగటుతో 34357 పరుగులు చేశాడు. సచిన్, విరాట్‌లతో పాటు శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్, శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే, దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్‌లు కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో 25000 పరుగుల మార్కును అధిగమించారు.