Virat Kohli: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 14,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు 35 ఏళ్ల కోహ్లి ఈ ఘనత సాధించేందుకు 15 పరుగులు చేయాల్సి ఉంది. విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డేల్లో 14 వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న వ్యక్తి కోహ్లీనే. 287 వన్డే ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 14 వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ విషయంలో కోహ్లి టెండూల్కర్‌ను వెనక్కినెట్టాడు. టెండూల్కర్ 350 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. అతను సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కరలను వెనక్కి నెట్టాడు. వన్డే ఇంటర్నేషనల్‌లో 14 వేల పరుగులు చేసిన భారత్ నుంచి మూడో ఆటగాడిగా, మొత్తంగా రెండో ఆటగాడిగా నిలిచాడు. పాకిస్థాన్‌పై 15 పరుగులు చేసిన తర్వాత విరాట్ కోహ్లి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
Also Read: Kuldeep Yadav: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారీ ఫీట్.. 300 వికెట్లు పూర్తి!
విరాట్ కోహ్లీ 14 వేల పరుగులు చేయడానికి 299 మ్యాచ్‌ల్లో 287 ఇన్నింగ్స్‌లు పట్టింది. సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్‌ల్లో 14 వేల పరుగులు పూర్తి చేశాడు. కాగా.. కుమార సంగక్కర 378 ఇన్నింగ్స్‌ల్లో 14 వేల పరుగులు పూర్తి చేశాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా కూడా నిలిచాడు. ఈ విషయంలో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 25 ఏళ్ల రికార్డును కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు. అజారుద్దీన్ వన్డేల్లో 156 క్యాచ్‌లు అందుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో కోహ్లీ 158 క్యాచ్‌లు అందుకున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు
- 299 – విరాట్ కోహ్లీ
- 350 – సచిన్ టెండూల్కర్
- 378 – కుమార్ సంగక్కర
భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు-
- 158 క్యాచ్‌లు పట్టిన ఆటగాడు విరాట్ కోహ్లీ
- మహ్మద్ అజారుద్దీన్ – 156 క్యాచ్‌లు
- సచిన్ టెండూల్కర్ – 140 క్యాచ్‌లు
- రాహుల్ ద్రవిడ్ – 124 క్యాచ్‌లు
- సురేష్ రైనా – 102 క్యాచ్‌లు