Kohli Launch Audi Q8 E-Tron: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ 2023 కోసం సిద్ధమవుతున్నాడు. గత మంగళవారం (ఆగస్టు 15) కోహ్లీ ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నట్లు కనిపించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీకి సంబంధించిన కొత్త చిత్రం ఒకటి తెరపైకి వచ్చింది. అందులో కోహ్లీ ఆడి కొత్త కారు లాంచ్ చేసినట్లు కనిపిస్తుంది. ఆడి క్యూ8 ఈ–ట్రాన్ (Kohli Launch Audi Q8 E-Tron)ను కోహ్లీ లాంచ్ చేశాడు.
ఈ కారు లాంచ్ కార్యక్రమంలో కోహ్లీ పాల్గొన్నారు. అతను తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా ఈ చిత్రాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రానికి “మెమొరీస్ విత్ ఆడి ఇండియా” అని శీర్షిక పెట్టాడు. అంతేకాకుండా “ఆడి క్యూ8 ఇ-ట్రాన్ ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాను.” అని రాసుకొచ్చాడు. జర్మన్ కార్ కంపెనీ ఆడి.. కోహ్లీతో చాలా కాలంగా ఒప్పందం కుదుర్చుకుంది. కోహ్లి.. ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్. 2021లో విరాట్ కోహ్లీతో ఆడి ఇండియా తన ఒప్పందాన్ని పొడిగించింది. భారత మాజీ కెప్టెన్ 2015 నుండి ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. కోహ్లీకి అనేక లగ్జరీ ఆడి వాహనాలు కూడా ఉన్నాయి.
Virat Kohli at the launch of Audi Q8 E-Tron.
King Kohli is the Brand Ambassador of Audi – The Face of World Cricket. pic.twitter.com/gC6wUHtKLv
— Tanuj Singh (@ImTanujSingh) August 18, 2023
ఆసియా కప్ ద్వారా మైదానంలోకి కోహ్లీ
ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ టెస్ట్, వన్డే సిరీస్‌లలో మాత్రమే కనిపించాడు. టెస్టులో కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ కూడా కనిపించింది. విండీస్ పర్యటనలో టీ20 సిరీస్‌లో కోహ్లితో సహా చాలా మంది స్టార్ ప్లేయర్లు భారత్ జట్టులో భాగం కాలేదు. ఇప్పుడు కోహ్లి ఆసియా కప్ 2023 ద్వారా నేరుగా మైదానంలోకి రానున్నాడు. టోర్నీకి ముందు కోహ్లీ జిమ్‌లో చెమటలు పట్టించాడు.
ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. భారత్, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లతో సహా మొత్తం ఆరు జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఇందులో గ్రూప్-ఎలో భారత్, పాకిస్తాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్-బిలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక ఉన్నాయి.
Also Read: Mahindra Recalls: 1.10 లక్షల కార్లను రీకాల్ చేసిన మహీంద్రా.. కారణమిదే..?
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఆడి క్యూ8 ఈ-ట్రాన్ పేరుతో నాలుగు వేరియంట్లలో ఈ కారును తీసుకొచ్చింది. ఆడి క్యూ8 50 ఈ-ట్రాన్, ఆడి క్యూ8 55 ఈ-ట్రాన్, ఆడి క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ 50 ఈ-ట్రాన్, ఆడి క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ 55 ఈ-ట్రాన్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. ఈ కార్ల ప్రారంభ ధర రూ. 1.13 కోట్లు కాగా.. గరిష్టంగా ధర రూ.1.30 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది.