Site icon HashtagU Telugu

Virat Kohli: ముంబైలో ప్రత్యక్షమైన విరాట్ కోహ్లీ.. ఎందుకో తెలుసా!

Virat Kohli

Virat Imresizer

ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్ లు జరుగుతున్న వేళ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మ్యాచ్ కు దూరం కావడం, సడన్ గా ముంబైలో ల్యాండ్ కావడం చర్చనీయాంశమవుతోంది. అయితే రెండో వార్మప్‌ మ్యాచ్‌ కోసం టీమ్‌ఇండియా (Team India) జట్టు తిరువనంతపురం చేరుకుంది. అయితే స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) జట్టుతో కలిసి రాలేదని తెలుస్తోంది. హఠాత్తుగా అతడు ముంబయి వెళ్లినట్లు సమాచారం.

“భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వ్యక్తిగత కారణాల కోసం ముంబై వెళ్ళినట్లు ధృవీకరించింది. విరాట్ త్వరలో జట్టులో తిరిగి చేరుతాడు” పేర్కొంది. అయితే విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) రెండోసారి తల్లికాబోతున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. అతడు ముంబయి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వీరిద్దరూ ముంబయిలోని ఓ గైనకాలజీ ఆసపత్రి వద్ద కన్పించినట్లు తెలుస్తోంది. 2017 కోహ్లీ, అనుష్క వివాహం జరగ్గా.. 2021 జనవరిలో వీరికి వామిక జన్మించింది. అయితే ఇటీవల అనుష్క శర్మ మీడియాకు చిక్కకపోవడం, పలు కార్యక్రమాలకు అటెండ్ కాకపోవడంతో మరోసారి తల్లి కాబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

భారత జట్టులో కోహ్లి మూలస్తంభాల్లో ఒకడు. నెదర్లాండ్స్ సన్నాహక ఆటకు పూర్తి ప్రాముఖ్యత లేనప్పటికీ, ఇతర మ్యాచుల్లో రాణించాలని అటు అభిమానులు, ఇటు బీసీసీఐ కోరుకుంటోంది. వ్యక్తిగత ఎమర్జెన్సీ ఏమిటో ఇంకా తెలియదు. కానీ విరాట్ సరైన సమయంలో జట్టుతో తిరిగి వస్తాడనే అంచనాలున్నాయి. ఇటీవల ముగిసిన సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లో చివరి మ్యాచ్ లో కోహ్లి భారత్ తరఫున ఆడాడు. 3వ ODIలో 56 పరుగులతో బ్యాటర్ ఫామ్ చూపించాడు. ఈ వన్డే ప్రపంచ కప్ కోహ్లీకి కీలకం కానుంది.

Also Read: Guntur Kaaram: తగ్గేదేలే.. అనుకున్న తేదీకి గుంటూరు కారం రిలీజ్