SeVVA: ‘సేవా’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రకటించిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ సేవా (SeVVA) అనే సంస్థను ప్రారంభించారు. ఈ సేవా ద్వారా ఈ జంట పేద ప్రజలకు సహాయం చేస్తుంది.

  • Written By:
  • Publish Date - March 24, 2023 / 02:14 PM IST

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ సేవా (SeVVA) అనే సంస్థను ప్రారంభించారు. ఈ సేవా ద్వారా ఈ జంట పేద ప్రజలకు సహాయం చేస్తుంది. ఇందుకోసం విరాట్ కోహ్లీ, అనుష్క తమ తమ లాభాపేక్షలేని సంస్థలను విలీనం చేసుకున్నారు. గతంలో వీరిద్దరూ వివిధ సంస్థల ద్వారా ప్రజలకు సహాయం చేసేవారు. విరాట్, అనుష్కల కొత్త లాభాపేక్షలేని సంస్థకు SeVVA అని పేరు పెట్టారు. దీనికి సంబంధించి అనుష్క, విరాట్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

‘SeVVA’ను సగర్వంగా మీ ముందుకు తెలుస్తున్నాం. ఇది మా ఇద్దరి కలయికతో వస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఇది. Se అంటే సెల్ఫ్, V అంటే విరాట్, V అంటే వామిక, A అంటే అనుష్క. కుటుంబంగా కలిసి సమాజానికి వీలైనంత సేవ, సాయం కోసం ఎదురుచూసేవాళ్లకు చేతనైనంత సహాయం అందించడంతే ఈ SeVVA లక్ష్యం అంటూ అనుష్క శర్మ ప్రకటించింది. అనుష్క శర్మ సోషల్ మీడియా పోస్టు ద్వారా ‘SeVVA’ సంస్థ వీడియోను పోస్ట్ చేసింది.. ‘గిబ్రాన్ చెప్పిన మాటల ప్రకారం.. ‘మీరు మీ ఆస్తులను ఇచ్చినప్పుడు కొంచెం మాత్రమే ఇస్తారు. అదే మీ నుంచి ఏదైనా ఇచ్చినప్పుడు పూర్తిగా నిజంగా ఇస్తారు.. ప్రాణం ఇచ్చేది జీవితం. దాతగా ఇచ్చే మీరు సాక్షిగా మాత్రమే నిలుస్తారు..’ అంటూ కాప్షన్ జోడించింది. ‘నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే పరుల సేవకు నిన్ను అర్పించు’ అంటూ మహాత్మా గాంధీ చెప్పిన కొటేషన్‌ని వీడియోలో జోడించింది అనుష్క శర్మ.

Also Read: Gujarat Titans: ఈ సారీ టైటిల్ మాదే.. కాన్ఫిడెంట్ గా గుజరాత్ టైటాన్స్

‘సేవా ద్వారా భవిష్యత్తులో పిల్లలకు స్కాలర్‌షిప్స్ ఇవ్వడంతో పాటు టాలెంట్ ఉన్న వారిని గుర్తించి వాళ్లు క్రీడల్లో రాణించేందుకు అవసరమైన సహాయాన్ని, సదుపాయాలను కల్పించాలని అనుకుంటున్నాం. దీనికి మీ అందరి తోడ్పాటు కావాలి’ అంటూ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అనుష్క శర్మ తన కూతురు పుట్టిన తర్వాత సినిమాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఆమె తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. కుమార్తె వామికతో ఎక్కువ సమయం గడుపుతోంది. ఆమె తదుపరి భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందించబడిన చక్దా ఎక్స్‌ప్రెస్‌లో నటించనుంది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో కనిపించనున్నాడు. ఈ ఏడాది కూడా టెస్టు క్రికెట్‌లో తన శతకాల కరువుకు తెరపడిన కోహ్లీ అహ్మదాబాద్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అతని నుంచి అద్భుతమైన ఆటతీరు వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.