Virat Anushka : సాధారణ కేఫ్‌లో విరాట్, అనుష్క క్రిస్మస్ బ్రేక్‌ఫాస్ట్.. ఇంకా ఏం చేశారంటే..

ఒక సాధారణ కేఫ్‌కు వెళ్లి వారిద్దరూ(Virat Anushka) బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం ఆ కేఫ్‌లోని కిచెన్‌లోకి ఇద్దరూ కలిసి వెళ్లారు.

Published By: HashtagU Telugu Desk
Virat Kohli Anushka Sharma Christmas Breakfast Melbourne Mcg Test

Virat Anushka : విరాట్ కొహ్లీ, అనుష్కా శర్మ దంపతులు ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్నారు. క్రిస్మస్ డే సందర్భంగా ఇవాళ ఉదయం వారిద్దరూ కలిసి మెల్‌బోర్న్‌లో పండుగ బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఒక సాధారణ కేఫ్‌కు వెళ్లి వారిద్దరూ(Virat Anushka) బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం ఆ కేఫ్‌లోని కిచెన్‌లోకి ఇద్దరూ కలిసి వెళ్లారు. అక్కడున్న చెఫ్‌లు, ఇతర సిబ్బందికి  క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.  ఈసందర్భంగా వారితో  కలిసి విరాట్ కొహ్లీ ఫొటోలు దిగారు. సాధారణ టీ షర్ట్, గ్రే జీన్స్‌లో విరాట్ సింపుల్‌గా కనిపించారు.

Also Read :Lottery King Case : లాటరీ కింగ్‌ ల్యాప్‌టాప్‌, ఫోన్లపై సుప్రీంకోర్టు కీలక ఆర్డర్

ఈసందర్భంగా కేఫ్ నిర్వాహకులు విరాట్‌కు ధన్యవాదాలు తెలిపారు. విరాట్ తమ కేఫ్‌కు వస్తారని అస్సలు అనుకోలేదని వెల్లడించారు. అనుకోని అతిథిలా విరాట్ తమ కేఫ్‌కు వచ్చి..అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి సంతోషపెట్టారని పేర్కొన్నారు. ఈమేరకు సదరు కేఫ్ నిర్వాహకులు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. దీంతోపాటు ఇవాళ ఉదయం విరాట్, అనుష్క మెల్‌బోర్న్‌లోని ఒక ప్రధాన వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం విరాట్ దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు.

ఇటీవలే విరాట్ కొహ్లీపై ఓ వివాదం రాచుకుంది. మెల్‌బోర్న్ ఎయిర్‌ పోర్టులో తన కుటుంబం ఫొటోలు తీస్తున్న ఒక ఆస్ట్రేలియన్ జర్నలిస్టును కొహ్లీ వారించారు. ఫ్యామిలీ ఫొటోలు తీయొద్దని అతడికి హితవు పలికారు.   తన కుటుంబానికి సంబంధించి తీసిన ఫొటోలు, వీడియోలన్నీ డిలీట్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. తన పిల్లలకు ప్రైవసీ ఉండాలని కోరుకుంటున్నట్లు విరాట్ కొహ్లీ స్పష్టం చేశారు.

Also Read :AUS vs IND: రేప‌ట్నుంచి నాలుగో టెస్టు.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్

  Last Updated: 25 Dec 2024, 01:31 PM IST