Site icon HashtagU Telugu

Virat- Rohit: విరాట్‌, రోహిత్‌ల‌కు ఫేర్‌వెల్ మ్యాచ్‌ను ఏర్పాటు చేసిన ఆస్ట్రేలియా!

BCCI

BCCI

Virat- Rohit: భారత క్రికెట్ దిగ్గజ ఆటగాడు టెస్ట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మే 7న టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐదు రోజుల తర్వాత జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మే 12న టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అయితే, ఈ ఇద్దరు ఆటగాళ్లకు (Virat- Rohit) ఫేర్‌వెల్ మ్యాచ్ ఏదీ జరగలేదు. అయితే ఈ ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రోహిత్‌, విరాట్‌ల‌ను ప్ర‌త్యేకంగా స‌త్క‌రించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివ‌ర‌లో ఆసీస్‌తో భార‌త్ జ‌ట్టు మూడు వ‌న్డేల సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్ కోసం రోహిత్, విరాట్ కూడా ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లొచ్చు.

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఫేర్‌వెల్ నిర్వహిస్తుంది

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఇప్పటివరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఫేర్‌వెల్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రోహిత్, విరాట్‌లకు ఫేర్‌వెల్ ఇవ్వడానికి ప్రణాళిక వేసింది. భారత జట్టు ఈ ఏడాది చివరలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో క్రికెట్ ఆస్ట్రేలియా.. టీమిండియా ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్ల కోసం ప్రత్యేక ఫేర్‌వెల్ సెరెమనీని హోస్ట్ చేయనుంది.

Also Read: Knee Pain: మోకాళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ ప్ర‌మాద‌క‌ర వ్యాధులు ఉన్న‌ట్లే!

విరాట్-రోహిత్‌లకు మరపురాని ఆస్ట్రేలియా పర్యటన

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఆస్ట్రేలియా పర్యటన వారి చివరి పర్యటన కావచ్చని, వారి అద్భుతమైన క్రికెట్ కెరీర్‌ను గౌరవించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. టాడ్ గ్రీన్‌బర్గ్ మరింత వివరిస్తూ.. ఇది వారి చివరి పర్యటన అవుతుందో లేదో తనకు తెలియదని, కానీ వారు దీనిని రోహిత్, విరాట్‌లకు మరపురాని అనుభవంగా మార్చాలని కోరుకుంటున్నామని తెలిపారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ వారు ఇద్దరూ ప్రస్తుతం వన్డేలు ఆడుతున్నారు. వారు ఎప్పుడైనా వన్డేల నుండి కూడా రిటైర్మెంట్ తీసుకోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తుంది. కాబట్టి వారు ఈ ఆస్ట్రేలియా పర్యటనను వారికి ప్రత్యేకమైనదిగా మార్చాలని కోరుకుంటున్నారు.