Site icon HashtagU Telugu

Virat-Anushka: విరాట్, అనుష్క జంట మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారా?

katrina anushka

katrina anushka

Virat Kohli-Anushka: నటి అనుష్క శర్మ, ఆమె భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీ జంట రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ జంట తమ రెండవ బిడ్డను ఆశిస్తున్నారని, శర్మ ప్రస్తుతం గర్భంతో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంటకు ఇప్పటికే వామిక అనే కుమార్తె ఉంది. ఆమె జనవరి 2021 లో జన్మించింది. ఇటీవలి కాలంలో అనుష్క శర్మ బహిరంగ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇక ముంబైలో ఫోటోలకు ఫోజులివ్వకుండా తప్పించుకుంటున్నారు. అంతేకాదు.. పబ్లిక్ ఫంక్షన్స్ నుండి తప్పించుకునేందుకు తక్కువ ప్రొఫైల్‌ మెయింటనెన్స్ చేస్తోందని  అని ముంబై మీడియా చెబుతోంది.

అంతేకాదు.. అనుష్క శర్మ కోహ్లీ మ్యాచులను చూసేందుకు, ఆయనతో బయటకు వెళ్లేందుకు ఇష్టం చూపడం లేదు. అతనితో కలిసి ప్రయాణించడం మానుకుంది. దీంతో అనుష్క శర్మ గర్భం దాల్చి ఉండవచ్చునని చాలామంది భావిస్తున్నారు. ఈ జంట ఇటీవల ముంబైలోని ఒక ప్రసూతి క్లినిక్‌లో కనిపించడంతో పుకార్లు నిజమని నమ్ముతున్నారు. 2017లో ఇటలీలో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో విరాట్, అనుష్క శర్మ పెళ్లి చేసుకున్నారు. స్టార్ సెలబ్రిటీ కపుల్ లో ఈ జంట ఒకటి.

Also Read: Lawrence: చంద్రముఖి2 కోసం లారెన్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా!