Site icon HashtagU Telugu

Vinesh Phogat Tears: భార‌త్ చేరుకున్న వినేష్ ఫొగట్‌.. సాక్షి మాలిక్‌ను కౌగిలించుకుని భావోద్వేగం..!

Vinesh Phogat Tears

Vinesh Phogat Tears

Vinesh Phogat Tears: భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొన్న తర్వాత భారతదేశానికి తిరిగి వ‌చ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వినేష్‌కి (Vinesh Phogat Tears) అక్కడ అద్భుతమైన స్వాగతం లభించింది. అంతేకాకుండా వినేష్.. సాక్షి మాలిక్‌ను కౌగిలించుకుని ఎమోష‌న‌ల్ అయ్యింది. సాక్షితో పాటు, బజరంగ్ పునియా, ఆమె కుటుంబం మొత్తం వినేష్‌కి స్వాగతం పలికారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ చాలా బలమైన ప్రదర్శన చేసి ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ ఫైనల్‌కు ముందు ఆమె అధిక బరువుతో ఉన్నట్లు నిర్వాహ‌కులు గుర్తించారు. దాని కారణంగా ఆమె ఫైన‌ల్స్‌కు అనర్హురాలిగా ప్ర‌క‌టించారు.

వినేష్.. సాక్షి మాలిక్‌ని కౌగిలించుకుని ఏడ్చింది

వినేష్ ఫోగట్ భారత రెజ్లర్, తోటి క్రీడాకారిణి సాక్షి మాలిక్ ని కౌగిలించుకుని ఏడ్చింది. ఆమె కళ్ళు కూడా కన్నీళ్లతో నిండి ఉన్నాయి. వినేష్ ఫోగట్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. వినేష్‌ను రిసీవ్ చేసుకోవడానికి ఆమె తోటి ఆటగాళ్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, కుటుంబసభ్యులతో పాటు అభిమానులు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో పాటు వినేష్‌కి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

Also Read: National Flag: వీడియో వైర‌ల్‌.. జాతీయ జెండా ముడి విప్పిన ప‌క్షి..!

పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్‌లో అనర్హురాలిగా ప్ర‌క‌టించారు

వినేష్ ఫోగట్ 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో అద్భుతంగా రాణించిన విష‌యం తెలిసిందే. ఆమె రౌండ్-16, క్వార్టర్-ఫైనల్, సెమీ-ఫైనల్స్‌లో వరుస విజయాలను నమోదు చేసింది. వినేష్ ఫైనల్స్‌లో తన స్థానాన్ని సంపాదించుకుంది. కనీసం రజత పతకమైనా ఖాయమైందనుకున్నారు భార‌త అభిమానులు. అయితే ఊహించ‌ని విధంగా ఆమెపై అనర్హత వేటు పడింది. వినేష్ 50 కిలోల కంటే 100 గ్రాములు అధిక బరువు కలిగి ఉంది. దీంతో ఆమె ఒలింపిక్ మెడ‌ల్‌ కల చెదిరిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

CASకి డిమాండ్

ఫైనల్ నుండి అనర్హులు అయిన తర్వాత వినేష్ ఫోగట్ ను ఫైనల్‌లో పాల్గొనడానికి అనుమతించాలని లేదా ఆమెకు ఉమ్మడి రజత పతకాన్ని ఇవ్వాలని CAS డిమాండ్‌ను లేవనెత్తారు. CAS దీనిని ఆగస్టు 13న విచారించింది. ఆ తరువాత నిర్ణయం మార్చింది. సీఏఎస్ నిర్ణయం 16న రావాల్సి ఉంది. అయితే 16వ తేదీకి బదులు వినేష్ అప్పీలును ఆగస్టు 14వ తేదీనే సీఏఎస్ తిరస్కరించింది. దీంతో ఖాళీ చేతులతో వినేష్ భార‌త్‌కు చేరుకుంది.