Site icon HashtagU Telugu

Vinesh Phogat : అస్వస్థతకు గురైన వినేష్ ఫోగట్

Vinesh Phogat Net Worth

Vinesh Phogat Net Worth

భారత రెజ్లర్, ఒలంపిక్ క్రీడాకారిణి వినేష్ ఫోగట్ (Vinesh Phogat) అస్వస్థతకు గురైంది. పారిస్ ఒలింపిక్స్‌ 2024లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్​కు దూసుకెళ్లి..​ ఆ తర్వాత అనర్హత వేటుకు గురైంది. అయితే తాజాగా ఆమె స్వదేశానికి చేరుకుంది. పారిస్‌ నుంచి ఢిల్లీ కి వచ్చిన ఆమెకు ఘన స్వాగతం దక్కింది. అయితే ఆమె ఢిల్లీ నుంచి స్వగ్రామం హరియాణాలోని బలాలికి 13 గంటల పాటు ప్రయాణించి చేరుకుంది. స్వగ్రామంలో స్థానికులు ఆమెకు భారీగా లడ్డూలను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే, సుదీర్ఘమైన ప్రయాణం చేసిన వినేశ్ తీవ్రంగా అలసిపోయింది. దీంతో సమావేశం జరుగుతుండగానే అస్వస్థతకు గురైంది. కాసేపు కుర్చీలోనే అలా ఉండిపోయింది. దీంతో అందరూ కాస్త కంగారుపడ్డారు. పక్కనే ఉన్న వినేష్ పెదనాన్న మహావీర్ ఫొగాట్, బజరంగ్ పునియా సపర్యాలు చేయడంతో కాస్త తెరుకుని మిగతా కార్యక్రమం సజావుగా జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన కు సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : CM Siddaramaiah : నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం..ఎలాంటి తప్పు చేయలేదు: సీఎం సిద్ధరామయ్య