Vinesh Phogat Retirement : వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం.. రెజ్లింగ్‌ నుంచి రిటైర్‌మెంట్

ఫైనల్ మ్యాచ్‌కు అతిచేరువలో ఉండగా బుధవారం ఉదయం ఆమెపై పారిస్ ఒలింపిక్స్‌ నుంచి అనర్హత వేటు పడింది.

Published By: HashtagU Telugu Desk
Vinesh Phogat Letter

Vinesh Phogat Letter

Vinesh Phogat Retirement : ప్రముఖ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రెజ్లింగ్ నుంచి తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో ఫైనల్ మ్యాచ్‌కు అతిచేరువలో ఉండగా బుధవారం ఉదయం ఆమెపై పారిస్ ఒలింపిక్స్‌ నుంచి అనర్హత వేటు పడింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన వినేష్ , ఇక రెజ్లింగ్ నుంచి రిటైర్ కావాలని డిసైడయ్యారు. ‘‘రెజ్లింగ్ నాతో మ్యాచ్ గెలిచింది. నేను మాత్రం ఓడిపోయాను. నా ధైర్యమంతా విరిగిపోయింది. నాకు ఇప్పుడు బలం లేదు. కుస్తీకి(2001-2024) ఇక వీడ్కోలు . నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను’’ అని తన ఎక్స్ పోస్టులో వినేష్ ఫోగట్(Vinesh Phogat Retirement) ఉద్వేగంగా రాసుకొచ్చారు. ఇక రెజ్లింగ్‌కు అల్ విదా చెప్పారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషాలకు ఈ పోస్ట్ పెట్టారు.

We’re now on WhatsApp. Click to Join

మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో పాల్గొనే రెజ్లర్ల బరువు ఉండాల్సిన దాని కంటే 100 గ్రాములు ఎక్కువ బరువుతో వినేష్ ఉన్నారని నిపుణులు గుర్తించారు. దీంతో ఆమె ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొనకుండా అనర్హత వేటు వేశారు. అకస్మాత్తుగా ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇలా జరగడంతో భారత్‌లో క్రీడా ప్రియులంతా షాక్‌కు గురయ్యారు. ఈ నిర్ణయం అన్యాయమైందని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో వినేష్‌కు నైతిక మద్దతు తెలుపుతూ, ఆమెలో ఆత్మస్థైర్యం నిలిపేలా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ సహా ఎంతోమంది ప్రముఖులు ట్వీట్స్ చేశారు. ప్రజల మనసుల్లో వినేష్ ఛాంపియన్‌గానే ఉంటారని వారు పేర్కొన్నారు.

Also Read :Tillu Boy : మిస్టర్ బచ్చన్ లో టిల్లు బోయ్ ట్విస్ట్ రివీల్..!

2001 సంవత్సరంలో వినేష్ రెజ్లింగ్ కెరీర్‌ను మొదలుపెట్టారు. తాజాగా ఇవాళ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ఆమె రెజ్లర్‌గా పోటీ పడిన చివరి సంవత్సరంగా 2024 పారిస్ ఒలింపిక్స్ మిగిలిపోయింది.ఫైనల్ మ్యాచ్‌కు ముందు తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వినేష్ ఫోగట్ వెంటనే పారిస్ ఒలింపిక్స్‌కు సంబంధించిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో పిటిషన్ వేశారు . కనీసం తనకు ఉమ్మడి వెండి పతకాన్ని అందించాలని ఆమె ఆ పిటిషన్‌లో కోరారు. దీనిపై ఇవాళ ఉదయం విచారణ జరగనుంది. సీఏఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read :IND vs SL: లంక దెబ్బ మామూలుగా లేదుగా వారు లేకున్నా సిరీస్ విజయం

  Last Updated: 08 Aug 2024, 06:33 AM IST