చైనాలో అక్టోబర్ 3 నుండి 7 వరకు జరుగనున్న ఆసియన్ గేమ్స్ లో పాల్గొనే భారత జట్టుకు విజయవాడకు చెందిన నెలకుడిటి అనూష ఎంపికైందని ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ తెలిపింది. అనూష ఆంధ్రప్రదేశ్ తరపున పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనడం జరిగిందని అసోసియేషన్ తెలిపింది. జాతీయస్థాయిలో పలు పతకాలు సాధించిన అనూష భారత జట్టుకు ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో సాఫ్ట్ టెన్నిస్ క్రీడా అభివృద్ధి పదంలో నడుస్తుందనడానికి అనూష భారత జట్టుకు ఎంపిక కావడమే నిదర్శనమన్నారు. అనూష గత మూడు నెలలుగా జాతీయ శిక్షణ శిబిరంలోనే ఉందని, ఆసియన్ గేమ్స్ లో పాల్గొనే భారత జట్టు ఐదుగురు సభ్యుల బృందంలో అనూష ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సాఫ్ట్ టెన్నిస్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ఆమోచూర్ సాఫ్ట్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్), అన్ని జిల్లాల క్రీడా ప్రాధికార సంస్థలకు, అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Asian Games : ఆసియన్ గేమ్స్ సాఫ్ట్ టెన్నిస్ ఎంపికైన విజయవాడ బాలిక

Asian Games soft tennis