Site icon HashtagU Telugu

Sanjay Bangar Daughter: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కుమారుడు!

Sanjay Bangar Daughter

Sanjay Bangar Daughter

Sanjay Bangar Daughter: టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ (Sanjay Bangar Daughter) కుమారుడు ఆర్యన్ హఠాత్తుగా వార్తల్లో నిలిచార‌. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకున్న ఆర్యన్ ఇప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోయింది. ఆర్యన్ నుంచి అనయగా మారిన భారత మాజీ క్రికెటర్ కుమారుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఆర్యన్ క్రికెట్ ఆటను తాను ఎంతగా ఇష్టపడుతున్నానో చెప్పాడు. అయితే లింగమార్పిడి మహిళా క్రికెటర్లకు నియమాలు లేకపోవడం వల్ల అతను ఈ ఆట నుండి మద్దతును కోల్పోతున్నాడు. ఆర్యన్ నుండి అనయ అయ్యే వరకు తన కష్టమైన ప్రయాణాన్ని కూడా ఆమె ప్రస్తావించింది.

ఆర్యన్ భావోద్వేగ పోస్ట్

ఆర్యన్ తన బాధాకరమైన కథను తన సోషల్ మీడియా ఖాతాలో రెండు పేజీల సుదీర్ఘ పోస్ట్‌లో పంచుకున్నాడు. తన తండ్రి ఆడటం చూసి తాను ఈ గేమ్‌లో చేరేందుకు ప్రేరణ పొందానని చెప్పాడు. దీంతో పాటు 22 గజాల పిచ్‌పై రంగులు సృష్టించేందుకు పగలు, రాత్రి కష్టపడిన‌ట్లు రాసుకొచ్చారు.

Also Read: Goodbye, VISTARA: ఎయిర్ ఇండియాతో విలీనం కాబోతున్న విస్తార, చివరి విమానాన్ని ఆపరేట్ చేసింది..

అయితే మహిళా క్రికెటర్‌తో ట్రాన్స్‌జెండర్ మహిళ ఆడేందుకు ఎలాంటి రూల్ లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది. తాను ఎంతగానో ఇష్టపడే ఆటకు దూరమవుతానని తాను ఊహించలేదని మాజీ క్రికెటర్ కుమారుడు చెప్పాడు. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకున్న తర్వాత శరీరంలో చాలా మార్పులు వచ్చాయని, అతని కండరాల శక్తి, బలం మునుపటి కంటే చాలా తగ్గిపోతున్నాయని ఆర్యన్ చెప్పాడు.

నిబంధనలపై ప్రశ్నలు లేవనెత్తారు

ట్రాన్స్‌జెండర్ మహిళా క్రికెటర్లకు సరైన నిబంధనలు లేకపోవడంపై కూడా ఆర్యన్ ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతిభ లేని కారణంగా ఈ ఆట నుంచి త‌ప్పుకోవ‌టంలేద‌ని, నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ఆటకు దూరంగా ఉండాల్సి వస్తోందని రాసుకొచ్చారు. ఆర్యన్ తన పోస్ట్ చివరలో లింగమార్పిడి మహిళలు కూడా ఈ గేమ్ ఆడటానికి, వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి తగిన అవకాశాలను పొందాలని డిమాండ్ చేశారు.