Site icon HashtagU Telugu

Team India: జయహో భారత్.. తొలి అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ సొంతం

Whatsapp Image 2023 01 29 At 20.28.16

Whatsapp Image 2023 01 29 At 20.28.16

Team India: టీమిండియా మరోసారి తన సత్తా చాటింది. ఐసీసీ మొదటిసారి నిర్వహిస్తున్న తొలి అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ ని గెలిచి ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. క్రికెట్ కు పుట్టినిల్లుగా చెప్పుకునే ఇంగ్లండ్ ను టీమిండియా మహిళ ప్లేయర్లు చిత్తుచిత్తుగా ఓడించారు. ఇంగ్లండ్ ను టీమిండియా 7 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది.

తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని.. ఇంగ్లండ్ ను టీమిండియా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే పటిష్టమైన ఫీల్డింగ్ తో పాటు అద్భుతమై బౌలింగ్ తో కేవలం 68 పరుగులకే ఇంగ్లండ్ ను అమ్మాయిలు కట్టడి చేయగలిగారు. కెప్టెన్ షఫాలీ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఎందుకు ప్లస్ గా మారిందో.. తర్వాత వికెట్లు వరుసగా పోతుంటే అందరికీ తెలిసి వచ్చింది.

మొదటి ఓవర్ నాలుగో బంతి నుండి ప్రారంభమైన వికెట్ల పతన పదో ఓవర్ చివరి బంతి వరకు సాగింది. త్రిష, అర్చనా దేవిలు రెండు అద్భుతమైన క్యాచులు పట్టడం, సౌమ్యా తివారీ డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడం లాంటి అనేక విషయాలు ఇంగ్లండ్ ను కేవలం 68 పరుగులకే పరిమితమయ్యేలా చేశాయి. ఇక బౌలర్లు అర్చనాదేవి, చోప్రాకు చెరో రెండు వికెట్లు, షెఫాలీ, సోనమ్ యాదవ్ లకు తల ఒక వికెట్ తీసుకున్నారు.

ఇక తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా మహిళల జట్టు 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ సాధించింది. సౌమ్య (24) త్రిష (24) వెర్మ (15) శ్వేత (5)లు చేయగా.. టీమిండియా ఐసీసీ నిర్వహించిన తొలి అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న మొదటి టీంగా చరిత్రలోకెక్కింది. అయితే ఈ విజయంలో మన తెలుగు అమ్మాయి గొంగిడి త్రిష తన బ్యాటింగ్ తో అదరగొట్టింది. మూడు ఫోర్లతో 24 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది.