KL Rahul: కేఎల్ రాహుల్ కు బిగ్ షాక్.. వైస్‌ కెప్టెన్‌ పదవి నుంచి తొలగింపు.

టీమిండియా ఓపెనర్ రాహుల్‌ను (KL Rahul) వైస్ కెప్టెన్‌గా తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన బోర్డు వైస్ కెప్టెన్ ఎవరనేది ప్రకటించలేదు. కేఎల్ రాహుల్‌కు కూడా వైస్ కెప్టెన్ హోదా ఇవ్వలేదు.

  • Written By:
  • Updated On - February 20, 2023 / 09:33 PM IST

టీమిండియా ఓపెనర్ రాహుల్‌ను (KL Rahul) వైస్ కెప్టెన్‌గా తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన బోర్డు వైస్ కెప్టెన్ ఎవరనేది ప్రకటించలేదు. కేఎల్ రాహుల్‌కు కూడా వైస్ కెప్టెన్ హోదా ఇవ్వలేదు. దీంతో రాహుల్ మూడో టెస్టు ఆడేది అనుమానమే అంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే అతని స్థానంలో వైస్ కెప్టెన్‌ను బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించలేదు. భారత బోర్డు ఈ నిర్ణయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మకే వదిలేసింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే మిగిలిన రెండు మ్యాచ్‌లకు భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌ని హిట్‌మ్యాన్ నిర్ణయిస్తాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లు ఇండోర్, అహ్మదాబాద్‌లలో జరగనున్నాయి.

బీసీసీఐ అధికారి ఒకరు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. “ఎవరినీ వైస్ కెప్టెన్‌గా చేయడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు” అని పేర్కొన్నారు. బదులుగా భారత బోర్డు ఈ నిర్ణయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మకే వదిలేసిందని తెలిపారు. అంతకుముందు, డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో ప్రకటించిన భారత టెస్టు జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. కానీ రాహుల్ పేలవమైన ఫామ్ కారణంగా సెలెక్టర్లు అతనిని వైస్ కెప్టెన్ పదవి నుండి తొలగించారు. ఢిల్లీలో జరిగిన టెస్టు తర్వాత మిగిలిన రెండు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ సెలక్టర్లు టీమిండియాను ప్రకటించారు. ఇందులో సెలెక్టర్లు వైస్ కెప్టెన్ పదవికి ఏ ఆటగాడిని ఎంపిక చేయలేదు.

Also Read: Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం

భారత టెస్టు జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడాది కాలంగా టెస్టు మ్యాచ్‌ల్లో ఎలాంటి ప్రత్యేక ప్రదర్శన చేయలేకపోయాడు. గణాంకాలను పరిశీలిస్తే.. గత ఏడాది కాలంగా టెస్టు మ్యాచ్‌లో రాహుల్ హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. గత 5 టెస్టు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ ఏ ఇన్నింగ్స్‌లోనూ 23 పరుగులకు మించి స్కోర్ చేయలేకపోయాడు. అతను చివరిసారిగా జనవరి 2022లో టెస్టు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేశాడు. అప్పటి నుంచి టెస్టు క్రికెట్‌లో ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు.

బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు: రోహిత్ శర్మ (C), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, పుజారా, కోహ్లీ, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జడేజా, షమీ, సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్, ఉమేష్ యాదవ్, ఉనాద్కత్‌లతో కూడిన జట్టును ప్రకటించింది. మార్చి 1న ఇండోర్‌లో మూడో టెస్టు, మార్చి 9న అహ్మదాబాద్‌లో 4వ టెస్టు జరగనుంది.