Viacom18: వయాకామ్‌ 18కే మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్!

టాప్ దిగ్గజాలు పోటీ పడిన వేళ వయాకామ్‌ (18 Viacom18) ప్రసార హక్కులు దక్కించుకుంది.

  • Written By:
  • Updated On - January 16, 2023 / 01:03 PM IST

బీసీసీఐ (BCCI) మరోసారి జాక్ పాట్ కొట్టింది. పురుషుల ఐపీఎల్ కు ధీటుగా మహిళల ఐపీఎల్ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటోంది. తాజాగా మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. టాప్ దిగ్గజాలు పోటీ పడిన వేళ వయాకామ్‌ (18 Viacom18) ప్రసార హక్కులు దక్కించుకుంది. బిడ్డింగ్ లో డిస్నీ స్టార్‌, సోనీ నెట్‌వర్క్‌, వయాకామ్‌ 18తో పాటు అమెజాన్‌ ప్రైమ్‌, ఫ్యాన్‌ కోడ్‌, టైమ్స్‌ ఇంటర్నెట్‌, గూగుల్‌, డిస్కవరీ పోటీ పడ్డాయి. చివరికి వయాకామ్‌ 18 (Viacom18) వచ్చే అయిదేళ్లకు రూ.951 కోట్లకు ప్రసార హక్కులు చేజిక్కంచుకుంది. అంటే ఒక్కో మ్యాచ్ కూ (Viacom18) రూ. 7.09 కోట్లు చెల్లించనుంది. ప్రసార హక్కుల విలువను బట్టి ఆదాయంపై ఫ్రాంచైజీలు అంచనాకు రానున్నాయి.

మహిళల ఐపీఎల్‌లో (Women IPL) పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలను జనవరి 25న బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఫ్రాంచైజీలకు సంబంధించిన ఆర్థిక బిడ్లను ఇప్పటికే బీసీసీఐ సీల్‌ చేసింది. అదే రోజు వీటిని తెరవనుంది. ఐదు ఫ్రాంచైజీలను, వేదికలను సొంతం చేసుకోవడానికి బీసీసీఐ గతవారం బిడ్లను ఆహ్వానిస్తూ టెండర్‌ విడుదల చేసింది. బిడ్డర్లు ఒకటి కంటే ఎక్కువ ఫ్రాంచైజీలకు, నగరాలకు పోటీ పడవచ్చు. అంతిమంగా విజయవంతమైన బిడ్డర్‌కు ఒక ఫ్రాంచైజీ మాత్రమే దక్కుతుంది. 2023 నుంచి 2025 వరకు మూడు సీజన్లలో ఒక్కో జట్టుకు 22 మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. లీగ్‌ దశలో ఒక్కో టీమ్‌ 20 మ్యాచులు ఆడనుంది. అగ్రస్థానంలో ఉండే జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్తుంది. రెండు, మూడు స్థానాల్లో ఉండే జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడతాయి. అందులో విజయం సాధించిన జట్టు తుది పోరుకు అర్హత సాధిస్తుంది. మహిళల ఐపీఎల్‌ నిర్వహణకు మార్చి నెల అనువుగా ఉంటుందని బీసీసీఐ (BCCI) తెలిపింది. 2026 సీజన్‌ నుంచి టోర్నమెంట్లో 33 నుంచి 34 మ్యాచులు నిర్వహిస్తారని తెలుస్తోంది.

ఒక్కో టీమ్‌లో తుది జట్టులో ఐదుగురు విదేశీ ప్లేయర్స్‌ను అనుమతించాలన్న ఆలోచనలో బోర్డు ఉంది. మెన్స్‌ ఐపీఎల్‌లో నలుగురు ప్లేయర్స్‌కే అనుమతి ఉంది. వుమెన్స్‌ ఐపీఎల్‌లో (IPL) నలుగురు ప్లేయర్స్‌ ఐసీసీలో ఫుల్‌టైమ్‌ మెంబర్‌ టీమ్స్‌ నుంచి ఉండాలని, ఒకరు అసోసియేట్‌ టీమ్‌ నుంచి ఉంటే సరిపోతుందన్న నిబంధన విధించనున్నారు.ఇదిలా ఉంటే 2023 ఐపీఎల్‌ రెండు వేదికల్లో, 2024 ఐపీఎల్‌ మరో రెండు వేదికల్లో, ఇక 2025 ఐపీఎల్‌ మిగిలిపోయిన ఒక్క వేదిక, 2023లో ఆడిన మరో వేదికలో ఆడే అవకాశం ఉంది.

Also Read: Nepal Plane Video: నేపాల్ విమానం కూలడానికి ముందు ఏం జరిగిందంటే!