Vettori Replaces Lara: లారాపై వేటు.. సన్ రైజర్స్ కొత్త కోచ్ వెటోరీ..!

సన్ రైజర్స్ కోచ్ గా బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారా (Vettori Replaces Lara) దారుణంగా విఫలమయ్యాడు. వేలం దగ్గర నుంచి మ్యాచ్ లకు టీమ్ ని సిద్దం చేయడంలో ఆకట్టుకోలేక పోయాడు.అందుకే, ప్రక్షాళనలో భాగంగా మొదటి వేటు లారాపైనే పడింది.

  • Written By:
  • Updated On - August 7, 2023 / 07:18 PM IST

Vettori Replaces Lara: అనుకున్నట్టే ఐపీఎల్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కోచింగ్ సిబ్బందిలో మార్పులతో ఈ పని మొదలు పెట్టింది. ఏ జట్టుకైనా కోచ్ అత్యంత ముఖ్యుడు. జట్టును గెలుపు దిశగా పక్కా వ్యూహాలతో నడిపించాల్సిన బాధ్యత కోచ్ పై ఉంటుంది. ఆ లెక్కన చూస్తే సన్ రైజర్స్ కోచ్ గా బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారా (Vettori Replaces Lara) దారుణంగా విఫలమయ్యాడు. వేలం దగ్గర నుంచి మ్యాచ్ లకు టీమ్ ని సిద్దం చేయడంలో ఆకట్టుకోలేక పోయాడు.అందుకే, ప్రక్షాళనలో భాగంగా మొదటి వేటు లారాపైనే పడింది.

లారా స్థానంలో సన్ రైజర్స్ కొత్త కోచ్ గా డానియల్ వెటోరీ నియమితుడయ్యాడు. వచ్చే సీజన్ నుంచీ వెటోరీ బాధ్యతలు చేపడతాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వెటోరీకి మంచి గుర్తింపు ఉంది. కెరీర్ లో 113 టెస్ట్ లు ఆడిన వెటోరీ 362 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు 4531 రన్స్ చేశాడు. ఇక 295 వన్డేల్లో 2253 పరుగులు చేసి.. ఏకంగా 305 వికెట్లు సాధించాడు. కివీస్ జట్టులో పోరాట పటిమ నింపిన కెప్టెన్లలో వెటోరీ కూడా ఒకడు. అన్ని విభాగాల్లో అనుభవం ఉన్న వెటోరీకి కోచ్ గా బాధ్యతలు అప్పగించడంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Tilak Varma: తిలక్ వర్మ అరుదైన రికార్డ్.. చిన్న వయసులో హాఫ్ సెంచరీ

గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటతీరు దిగజారుతోంది. కెప్టెన్లను మార్చినా ఫలితం శూన్యం. వేలంలో ఎంతో పొదుపుగా డబ్బు ఖర్చు పెడుతుందని సన్ రైజర్స్ కు పేరుంది. సరైన ఆల్ రౌండర్లను కొనుగోలు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఐపీఎల్ లో ఆ జట్టు తీసికట్టుగా తయారైందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గత సీజన్ లో రూ.13.25 కోట్లతో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ను కొనుగోలు చేసినా తీవ్రంగా నిరాశ పరిచాడు.

హ్యారీ బ్రూక్ ఒక్కడే కాదు, జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లు కొందరిని వదిలించుకునేందుకు సన్ రైజర్స్ యాజమాన్యం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలాంటి ఆటగాళ్లలో ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నారు. ఈ ఏడాది డిసెంబరులో ఐపీఎల్ మినీ వేలం నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉంది. దాంతో, ఆ లోపే పలువురు ఆటగాళ్లను సాగనంపాలని సన్ రైజర్స్ యాజమాన్యం భావిస్తోంది.