Site icon HashtagU Telugu

IPL2022: ధోనీనే కెప్టెన్ గా కొనసాగాలి – ఆర్పీ సింగ్

90

90

భారత మాజీ ఆటగాడు ఆర్పీ సింగ్ ఐపీఎల్ లో చెన్నై వరస ఓటమిలను దృష్టిలో పెట్టుకొని సంచలన కామెంట్స్ చేసాడు. చెన్నయ్ లో ధోని ఆడుతున్నాడంటే కెప్టెన్ గా కూడా అతనే ఉండాలని వ్యాఖ్యానించాడు, చెన్నై జట్టు వరుసగా జరిగిన రెండు మ్యాచ్ల లో పరాజయం పాలైన నేపథ్యంలో ధోని జట్టు సారధిగా లేకపోవడం కూడా ఆటగాళ్ళ ఏకాగ్రత మరియు బాధ్యత దెబ్బతిని ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ప్రదర్శించడం లేదని ఇదిలానే కొనసాగితే మరిన్ని మ్యాచ్లు దుషఫలితాలని ఇచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు..

ఓటమి తర్వాత పుంజుకొనే శక్తి కలిగిన సారధుల్లో ధోని ముందువరసలో ఉంటాడని, అత్యంత కఠిన పరిస్థితితుల్లో జట్టుని ముందుకి నడిపించిన ధోని ఇంత అకస్మాతుగా కెప్టెన్సీ సారద్యం నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయం కాదని, ఇప్పటికైనా జట్టు యాజమాన్యం ధోని పై వత్తిడి తెచ్చి జట్టు బాధ్యతలని అధికారికంగా ధోనికి అప్పగించాలని ఆర్పీ సింగ్ సూచించాడు. ధోని ని అత్యుత్తమ కెప్టెన్ గా ఆదరించిన అభిమానులు ఇప్పుడు అతన్ని కేవలం జట్టు లో సాధారణ సభ్యునిగా చూడడం ఏ మాత్రం సహించలేకపోతున్నారు, తిరిగి ధోని జట్టు భాద్యతలను ధోని తీసుకున్నప్పుడే అభిమానులు తిరిగి పూర్వ ఉత్సాహం పొందుతారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు, ధోని కెప్టెన్సీ భాద్యాతలు నుంచి తప్పుకొని జడేజా కెప్టెన్ గా భాద్యాతలు స్వీకరించి వరుస పరాజాయాలు మరియు పేలవ ప్రదర్శన చూపించిన సందర్భంలో ఆర్పీ సింగ్ ఈ వ్యాఖ్యలు చేసాడు.

ఇదిలాఉంటే… ఐపీఎల్ 2022 సీజన్లో ధోని అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 350 మ్యాచ్‌లు ఆడిన రెండో భారత ఆటగాడిగా ధోని నిలిచాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో ధోని ఈ రికార్డు సాధించాడు. అలాగే టీ20ల్లో 7000 పరుగులు సాధించిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్‌-15వ సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్నాడు. దీంతో రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించారు.