Site icon HashtagU Telugu

Dhoni Garage Video: వైరల్ అవుతున్న ధోనీ గ్యారేజీ వీడియో

Dhoni Garage

New Web Story Copy 2023 07 18t134224.152

Dhoni Garage Video: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి కార్లన్నా, బైకులన్న ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ధోనీ వాహన గ్యారేజిలో తక్కువ స్థాయి వాహనం నుంచి ఖరీదైన వాహనాల కలెక్షన్ ఉంటుంది. ఇక తన క్రికెట్ కెరీర్లో సాధించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లలో భాగంగా అనేక కార్లు, బైకులు అందుకున్నారు. అవన్నీ ప్రస్తుతం ధోనీ గ్యారేజిలో భద్రంగా ఉన్నాయి. తాజాగా ధోనీ గ్యారేజిని సందర్శించారు మాజీ క్రికెటర్స్ వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషి. ధోనీ బ్యారేజీని చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారట.ధోనీ గ్యారేజిలో వెహికిల్ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఎంత పిచ్చి ఉంటే గానీ ఇలా చేయరు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్.

రాంచీని సందర్శించిన మాజీలు ధోనీ ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఈ సందర్భంగా ధోనీ కార్ గ్యారేజిని సందర్శించి ఖంగుతిన్నారు. ఈ సందర్భంగా ధోనీ గ్యారేజికి సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు . ప్రస్తుతం ధోనీ గ్యారేజీ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Also Read: Sexual Harassment : ఆంధ్రాయూనివ‌ర్సిటీ ప్రోఫెస‌ర్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు