Site icon HashtagU Telugu

KKR vs MI IPL 2023: వెంకటేశ్ అయ్యర్ సెంచరీ వృథా.. కోల్‌కతాపై ముంబై ఘనవిజయం..

MI vs KKR Venkatesh Iyer's Century Is Wasted.. Mumbai's Big Win Over Kolkata..

Venkatesh Iyer's Century Is Wasted.. Mumbai's Big Win Over Kolkata..

KKR vs MI IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ చేసినా.. సమిష్టిగా రాణించిన ముంబై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది రెండో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలిచింది. ఫామ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ సెంచరీతో కదం తొక్కాడు. స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ముంబై బౌలర్లపై ఆధిపత్యం కనబరిచిన వెంకటేశ్ అయ్యర్ 51 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు చేసింది.

అయితే మిగిలిన వారు పెద్దగా రాణించకపోవడంతో కేకేఆర్ ఆశించిన స్కోరు చేయలేకపోయింది. నితీశ్ రాణా, గుర్బాజ్ , రింకూ సింగ్ నిరాశపరిచారు. చివర్లో రస్సెల్ మెరుపులు మెరిపించడంతో స్కోర్ 180 దాటింది. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ 2 వికెట్లు , కామెరూన్ గ్రీన్, డ్వాన్ జన్సెన్, పియూష్ చావ్లా, రిలే మెరిడెత్ తలో వికెట్ పడగొట్టారు.

లక్ష్యచేధనలో ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అదరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇషాన్ కిషన్ బౌండరీలతో విరుచుకుపడటంతో 4 ఓవర్లలోనే 57 పరుగులు చేసింది. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సుయాశ్ శర్మ విడదీసాడు. రోహిత్ ఔటైనా.. సూర్యతో కలిసి ఇషాన్ చెలరేగడంతో ముంబై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. సుయాశ్ శర్మ వేసిన ఏడో ఓవర్‌లో బౌండరీ బాదిన ఇషాన్ కిషన్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుణ్ చక్రవర్తీ మరుసటి ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన ఇషాన్ కిషన్ మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ తన ఫామ్‌ను కొనసాగించాడు. తనదైన షాట్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. ఆరంభంలో కాస్త తడబడినా.. ఫామ్ అందుకున్న సూర్య కూడా బౌండరీలు బాదాడు. ఫెర్గూసన్ వేసిన 11వ ఓవర్‌లో సూర్య వరుసగా రెండు సిక్స్‌లు బాది ఫామ్ అందుకున్నాడు. సుయాశ్ వీరి జోడీని విడదీయగా.. తర్వాత తిలక్ వర్మను పెవిలియన్‌కు పంపాడు. తిలక్ ఔటైనా.. టీమ్ డేవిడ్‌తో కలిసి సూర్య చెలరేగాడు. చివర్లో కామెరూన్ గ్రీన్‌తో కలిసి టీమ్ డేవిడ్13 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 24 నాటౌట్ విజయాన్ని పూర్తి చేశాడు. సూర్యకుమార్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 , తిలక్ వర్మ 30  పరుగులు చేశారు.

Also Read:  CRPF Exams: ఇక ఆ ఎగ్జామ్స్ తెలుగులోనూ.. కేంద్ర సర్కారు కీలక నిర్ణయం