Vaibhav Suryavanshi: వన్డేల్లో తొలి ట్రిపుల్ సెంచరీ, రోహిత్ శర్మ రికార్డు బద్దలు

బీహార్ క్రికెట్ అసోసియేషన్ ఆదివారం నిర్వహించిన రణధీర్ వర్మ అండర్-19 వన్డే మ్యాచ్ లో సమస్తిపూర్ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ అజేయంగా ట్రిపుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు బద్దలైంది.;

Vaibhav Suryavanshi: బీహార్ క్రికెట్ అసోసియేషన్ ఆదివారం నిర్వహించిన రణధీర్ వర్మ అండర్-19 వన్డే మ్యాచ్ లో సమస్తిపూర్ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ అజేయంగా ట్రిపుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు బద్దలైంది.

అంతకుముందు 2002 కౌంటీ ఫస్ట్-క్లాస్ వన్డే మ్యాచ్‌లో సర్రే తరపున అలీ బ్రౌన్ గ్లామోర్గాన్‌పై 268 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇప్పుడు వన్డేల్లో అత్యధికంగా 264 పరుగులు చేసిన రోహిత్ శర్మ రికార్డు బద్దలైంది. వన్డే క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు క్రికెటర్ గా వైభవ్ రికార్డు నెలకొల్పాడు.

ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క ట్రిపుల్ సెంచరీ నమోదైంది. అందుల క్రికెట్ టోర్నమెంట్‌లో నమోదైంది. జూన్ 14 2022న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీఫెన్ నీరో బ్రిస్బేన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే క్రికెట్‌లో మొదటి ట్రిపుల్ సెంచరీని సాధించి చరిత్ర సృష్టించాడు. నీరో 140 బంతుల్లో 309 పరుగులతో అజేయంగా నిలిచాడు.

We’re now on WhatsAppClick to Join.

కాగా వైభవ్ సూర్యవంశీ 178 బంతుల్లో 332 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అజేయంగా నిలిచాడు. అతని సహకారంతో సమస్తిపూర్ సహర్సాను 281 పరుగుల భారీ తేడాతో ఓడించింది.

Also Read: Mahesh Babu : అమెరికాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్.. వీడియో వైరల్..