Novak Djokovic : ఆస్ట్రేలియా ప్రభుత్వంపై జకోవిచ్ పరువునష్టం దావా

తనను అవమానించిన ఆస్ట్రేలియా ప్రభుత్వంపై వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు.

Published By: HashtagU Telugu Desk
Novak Djokovic Australian Open 5640947 Imresizer

Novak Djokovic Australian Open 5640947 Imresizer

తనను అవమానించిన ఆస్ట్రేలియా ప్రభుత్వంపై వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. నిర్వాహకులు అనుమతించినా.. అక్కడి ప్రభుత్వం అడ్డుకోవడంపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న జకోవిచ్ ఆసీస్ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేయబోతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడనివ్వకపోవడం, బలవంతంగా హోటల్ క్వారంటైన్ కు తరలించడం వంటి కారణాలు చూపుతూ 32 కోట్ల రూపాయలకు దావా వేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై తన లాయర్లతో చర్చిస్తున్న జకోవిచ్ ఆస్ట్రేలియా ప్రభుత్వంపై న్యాయపోరాటం కొనసాగించాలని భావిస్తున్నాడు. ఏడాది తొలి గ్రాండ్ శ్లామ్ ఆడేందుకు మెల్ బోర్న్ వెళ్ళిన జకోవిచ్ ను ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో తమ దేశంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. దీనిపై కోర్టును ఆశ్రయించిన జకోకు మొదట్లో ఉపశమనం లభించినా… రెండోసారి ఆస్ట్రేలియా ప్రభుత్వం విజయం సాధించింది.

అటు కోర్టు కూడా అతని వీసా రద్దును సమర్థిస్తూ తీర్పునిచ్చింది. దీంతో తమ దేశంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు మరో మూడేళ్ళపాటు ఆస్ట్రేలియాకు రాకుండా నిషేధం విధించింది. వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేసిన జకో ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని వదలేది లేదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా క్వారంటైన్ హోటల్ లో ఏర్పాట్లు సరిగా లేకపోవడం, వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ హోదాలో కనీసం తనకు మర్యాద కూడా ఇవ్వకపోవడంపై జకో తీవ్రంగా నొచ్చుకున్నాడు. జకోతో పాటు అతని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రముఖ మ్యాగ్ జైన్లు కథనాలు ప్రచురించాయి. మొత్తం మీద వ్యాక్సిన్ తీసుకోకపోవడానికి సరైన కారణాలు చెప్పినా… ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారులు తనను అవమానించడంపై జకోవిచ్ సీరియస్ గా తీసుకున్నాడు.

  Last Updated: 20 Jan 2022, 12:46 PM IST