Usman Khawaja Retire: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్‌.. స్టార్ ప్లేయ‌ర్ రిటైర్మెంట్?

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ బియాండ్ 23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఖవాజా మాకు అద్భుతమైన ఆటగాడు. నిజంగా అద్భుతమైన ఆటగాడు. అతను విదేశాలలో పరుగులు సాధించాడు.

Published By: HashtagU Telugu Desk
Usman Khawaja Retire

Usman Khawaja Retire

Usman Khawaja Retire: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బ్యాడ్ ఫామ్‌లో ఉన్నారు. అయితే వీరిద్ద‌రూ బోర్డ‌ర్‌- గ‌వాస్క‌ర్ ట్రోఫీ త‌ర్వాత టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తార‌ని క‌థ‌నాలు చాలా వ‌స్తున్నాయి.ఆసీస్ స్టార్ ప్లేయ‌ర్‌ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja Retire) పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ కంగారూ ఓపెనర్ ఇప్పటివరకు సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లో 20 సగటుతో 141 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఖ‌వాజా 2024 సంవత్సరంలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. అందులో ఖ‌వాజా సగటు 25.93 మాత్రమే. భారత కెప్టెన్ రోహిత్ మాదిరిగానే ఖవాజా కూడా సిడ్నీ టెస్టు తర్వాత రిటైర్మెంట్ ప్రకటించవచ్చని ఆసీస్ మీడియా క‌థ‌నాలు పేర్కొంది.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ బియాండ్ 23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఖవాజా మాకు అద్భుతమైన ఆటగాడు. నిజంగా అద్భుతమైన ఆటగాడు. అతను విదేశాలలో పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియాలో పరుగులు చేశాడు. అతడికి 38 ఏళ్లు. అతను రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇది గొప్ప అవకాశం. సిడ్నీ అతని చివరి టెస్ట్ అని నేను భావిస్తున్నాను అని క్లార్క్ అన్నారు. దీంతో ఖ‌వాజా సిడ్నీ టెస్టు త‌ర్వాత టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: BCCI Meeting With Rohit: రోహిత్‌- గంభీర్‌తో బీసీసీఐ స‌మావేశం.. ఏం జ‌రుగుతుందో?

క్లార్క్ ఇంకా మాట్లాడుతూ.. ఖ‌వాజా శ్రీలంక సిరీస్‌లో ఆడాలనుకుంటున్నాడు. కానీ అతనికి సమయం ఆసన్నమైంది. అతను ఆడటం కొనసాగించాలనుకుంటున్నాడని నాకు తెలుసు. ఈ సిరీస్‌లో అతడి ఫామ్ టీమ్‌ కోరుకున్నంతగా లేదు. ఆసీస్ ఈ సిరీస్ త‌ర్వాత శ్రీలంకలో పర్యటించాలని, ఆ తర్వాత యాషెస్ కూడా ఆడాలని నాకు తెలుసు. ఈ మధ్యకాలంలో క్రికెట్ చాలా ఉంది. యాషెస్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ ప్రారంభించి కొంత టెస్ట్ క్రికెట్ ఆడేందుకు కొత్త ఆటగాడికి ఇది గొప్ప అవకాశం అని కూడా నేను భావిస్తున్నాను అని క్లార్క్ స్ప‌ష్టం చేశాడు.

2022లో జట్టులోకి తిరిగి వచ్చినప్పటి నుండి ఖవాజా 33 టెస్టు మ్యాచ్‌ల్లో 49 సగటుతో 2705 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 13 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో అతని అత్యుత్తమ స్కోరు 195 పరుగులు. మొత్తం మీద ఖవాజా 77 టెస్టు మ్యాచ్‌ల్లో 44 సగటుతో 5592 పరుగులు చేశాడు. మొత్తం 15 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. భారత్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్టు సిరీస్‌లో ఖవాజా కేవలం ఒక అర్ధసెంచరీ మాత్రమే చేశాడు. ఖ‌వాజా చాలా సందర్భాలలో తన జట్టుకు ఘనమైన ఆరంభాన్ని అందించలేకపోయాడు.

  Last Updated: 01 Jan 2025, 11:28 AM IST