Usain Bolt: క్రికెట్ ప్ర‌పంచంలోకి ఉసేన్ బోల్ట్‌.. ఆడ‌టానికి కాదండోయ్‌..!

జూన్ 1 నుండి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న T20 ప్రపంచ కప్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గొప్ప స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 08:00 AM IST

Usain Bolt: జూన్ 1 నుండి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న T20 ప్రపంచ కప్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గొప్ప స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌ (Usain Bolt)ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. జమైకాలో జన్మించిన బోల్ట్ 2008 బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో చరిత్ర సృష్టించాడు. అక్కడ అతను ప్రపంచ రికార్డు సమయాల్లో 100మీ, 200మీ, 4×100మీ రేసుల్లో గోల్డ్ మెడ‌ల్స్‌ గెలుచుకున్నాడు. బోల్ట్ ప్రస్తుతం 9.58 సెకన్లు, 19.19 సెకన్లు, 36.84 సెకన్ల టైమింగ్‌లతో 100మీ, 200మీ, 4×100మీలో ప్రపంచ రికార్డులను కలిగి ఉన్నాడు. ప్రపంచ కప్ తన దేశానికి రావడం, తన కొత్త పాత్ర గురించి బోల్ట్ ఉత్సాహంగా ఉన్నాడు. అమెరికాలో క్రికెట్‌కు మార్కెట్ దొరకడం పెద్ద విషయమని బోల్ట్ అన్నాడు.

8 సార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత ఉసేన్ బోల్ట్ ఏప్రిల్ 24, బుధవారం నాడు T20 ప్రపంచ కప్ 2024 కోసం అంబాసిడర్‌గా నామినేట్ అయ్యాడు. ఈ సంవత్సరం T20 ప్రపంచ కప్‌కు సహ-హోస్ట్ చేయడం, 2028లో ఒలింపిక్స్‌కు విజయవంతంగా పునరాగమనం చేయడం వల్ల USలో క్రికెట్ అభివృద్ధి చెందుతుందని బోల్ట్ అభిప్రాయపడ్డాడు. బోల్ట్.. జమైకాలోని కరేబియన్ దీవిలో క్రికెట్ ఆడుతూ పెరిగాడు. హైస్కూల్‌లో అతని క్రికెట్ కోచ్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పాల్గొనమని ప్రోత్సహించాడు. అతను అథ్లెటిక్స్, స్ప్రింటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టాడు.

Also Read: DC vs GT: రెచ్చిపోయిన పంత్, అక్షర్.. ఢిల్లీ చేతిలో ఓడిన గుజరాత్

అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే టోర్నీల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు బోల్ట్ తెలిపాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాబోయే ICC పురుషుల T20 ప్రపంచ కప్‌కు నేను అంబాసిడర్‌గా ఉండబోతున్నాను. జీవితంలో క్రికెట్‌ భాగమైన కరేబియన్‌ దీవుల నుంచి వచ్చిన నా హృదయంలో ఆటకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నీలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు. ఇక‌పోతే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జూన్ 1న ప్రారంభ‌మై.. జూన్ 29న టైటిల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు సిద్ధ‌మ‌య్యాయి.

We’re now on WhatsApp : Click to Join