Site icon HashtagU Telugu

uppal stadium : టీం ఇండియా కు ఉప్పల్ స్టేడియం కంచుకోట.. రికార్డులే చెపుతున్నాయి

Uppal Stadium

Uppal Stadium

రేపటి నుండి ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో(Uppal Cricket Stadium) భారత్(India)-ఇంగ్లాండ్‌(England) మధ్య ఐదు టెస్టు సిరీస్‌లలో(Test series) భాగంగా తొలి టెస్ట్ జరగనుంది. ఈ క్రమంలో స్టేడియం సరికొత్త లుక్ లో అదరహో అనిపిస్తుంది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. సరికొత్త కలర్ తో..సిట్టింగ్ తో భలేగా ఉందే అనేలా తళుక్మంటుంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సొంత గడ్డపై భారత్‌ బలమైన జట్టుగా బరిలోకి దిగబోతుంది. ఉప్పల్‌ స్టేడియం అంటే..భారత క్రికెట్ అభిమానులకే కాదు జట్టుకు సైతం ఎంతో ఇష్టం. భారత్‌కు ఉప్పల్ స్టేడియం కంచుకోట గా భావిస్తారు. ఈ స్టేడియంలో టెస్టుల్లో భారత్‌ను ఓడించిన జట్టే లేదు. ఐదు టెస్టు మ్యాచ్‌లు ఇందులో జరగగా 4 టెస్టుల్లో టీమిండియా విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. వన్డేల్లోనూ టీమిండియాకే అత్యధికశాతం విజయాలు దక్కాయి.

ఇప్పటివరకు టీం ఇండియా (India) గెలిచిన మ్యాచ్ లు చూస్తే…

* 2010లో భారత్-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ డ్రాగా గా… ఈ మ్యాచ్‌లో 111 పరుగులతో హర్భజన్‌సింగ్‌ సెంచరీ చేసి ఆకట్టుకున్నారు.

* 2012లో మరోసారి న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడగా.. ఈ టెస్టులో 115 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.

* 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 135 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.

* 2017లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 208 పరుగుల తేడాతో భారత్‌ విజయడంఖా మోగించింది.

* 2018లో వెస్టిండీస్‌తో భారత్‌ తలపడగా.. ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఉప్పల్‌ స్టేడియం కోహ్లీకి ఫేవరేట్‌ అనే చెప్పాలి. ఆడిన ఐదు టెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో 379 పరుగులు చేసి 75.80 సగటుతో రాణించాడు. కానీ రేపటి నుండి ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో వ్యక్తిగత కారణాలతో కోహ్లీ ఈ టెస్ట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రేపటి నుడ్ని 29 వరకు హైదరాబాద్‌లో జరగనుండగా..రెండో టెస్టుకు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. ఇప్పటికే భారత్, ఇంగ్లండ్‌ జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. మంగళవారం రెండు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి.

Read Also : Huge Discounts: గుడ్ న్యూస్‌.. ఈ మూడు కార్ల‌పై భారీగా డిస్కౌంట్స్‌..!