Site icon HashtagU Telugu

Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్‌పై బిగ్ అప్డేట్‌.. చెన్నై సీఈవో ఏమ‌న్నారంటే..?

Dhoni Retirement

Dhoni Retirement

Dhoni Retirement: చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. IPL 2024 ముగిసిన తర్వాత మహి IPL ప్రయాణం కూడా ముగుస్తుందని, అతను రిటైర్ (Dhoni Retirement) అవుతాడని అంతా భావించారు. చాలా మంది వెటరన్ ఆటగాళ్లు కూడా మహి రిటైర్ అవుతాడని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చెన్నై ప్లేఆఫ్స్ నుండి నిష్క్రమించినందున ధోనీ ఐపిఎల్ 2025లో ఆడతాడా లేదా అనే దాని గురించి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ ధోనీకి సంబంధించిన ఓ వార్త‌ను మీడియాతో పంచుకున్నారు.

ధోని గురించి చెన్నై సీఈవో ఏమన్నారంటే?

చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోనీ గురించి సమాచారం ఇచ్చారు. క్రిక్‌బజ్‌తో ఆయ‌న‌ మాట్లాడుతున్నప్పుడు.. మహేంద్ర సింగ్ ధోని ఐపిఎల్ నుండి రిటైర్ అవుతాడా లేదా అనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పాడు. CSK CEOని ధోని త‌ర్వాత సీజ‌న్‌లో ఆడ‌తారా అని ప్ర‌శ్నించ‌గా.. దానిపై అతను ఇంకా క్లియర్ చేయలేదని చెప్పాడు. వచ్చే సీజన్‌లో ఆడతాడా లేదా అనే దానిపై ధోనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. అంటే తదుపరి సీజన్‌లో కూడా మహి ఆడే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: Bajaj Pulsar F250: బ‌జాజ్ నుంచి మ‌రో సూప‌ర్ బైక్‌.. ధ‌ర ఎంతంటే..?

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్టార్ ఆటగాడు అంబటి రాయుడు ధోనీ గురించి చెప్పాడు. ఓడిపోయిన తర్వాత ధోని నిష్క్రమించడం మంచిది కాదు. ఐపీఎల్ 2024లో సీఎస్‌కే ట్రోఫీ గెలిస్తే రిటైరైతే బాగుండేదని, ఇప్పుడు సీఎస్‌కే ప్లేఆఫ్‌కు దూరమైందని, అలాంటి పరిస్థితుల్లో మహి ప్రస్తుతానికి ఐపీఎల్‌ నుంచి రిటైర్‌మెంట్ తీసుకోక‌పోవ‌ట‌మే మంచిద‌ని చెప్పాడు.

We’re now on WhatsApp : Click to Join

ధోనీ వచ్చే సీజన్‌లో కూడా ఆడగలడు- రైనా

ధోనీ తదుపరి సీజన్‌లో కూడా ఆడాలి. ట్రోఫీ గెలిచిన తర్వాత ఐపీఎల్‌కు వీడ్కోలు పలకాలని చెన్నై మాజీ ఆటగాడు సురేశ్ రైనా కూడా ఆశాభావం వ్య‌క్తం చేశాడు. అంతేకాకుండా ధోనీ రిటైర్మెంట్ గురించి కూడా చెప్పాడు. అతను వచ్చే సీజన్‌లో కూడా జట్టుతో ఆడటం చూడవచ్చని పేర్కొన్నాడు. అదే సమయంలో వచ్చే సీజన్‌లో ధోని చెన్నైకి మెంటార్‌గా చేరవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మహి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.