Site icon HashtagU Telugu

IPL Saha: వృద్ధిమాన్ సాహా గొప్ప పవర్ ప్లేయర్ : కోచ్ గ్యారీ కిర్ స్టెన్

wriddhiman saha

గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఓపెనర్ వృద్ధిమాన్ సాహా గొప్ప “పవర్ ప్లేయర్ ” అని కోచ్ గ్యారీ కిర్ స్టెన్ కొనియాడారు. మొదటి 10 ఓవర్లలో 30 యార్డుల సర్కిల్ ఆవల ఇద్దరు ఫీల్డర్లే ఉంటారు. ఈ పవర్ ప్లే నిబంధనను వాడుకోవడంలో దిట్ట వృద్ధిమాన్ సాహా అని ఆయన అభివర్ణించారు. “పవర్ ప్లే ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో అతడికి మేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈవిషయాన్ని సాహా నిరూపించాడు.

షార్ట్ బాల్స్ ఎలా ఆడాలనే నైపుణ్యం కూడా అతడి సొంతం. యశ్ దయాల్ బౌలింగ్ లో బాగా రాణిస్తున్నాడు. కీలకమైన 19వ ఓవర్లో అతడు బౌలింగ్ వేసి కేవలం 8 పరుగులే ఇచ్చాడు. ఇలా పొదుపు చేసే పరుగులే జట్టు విజయాన్ని సునాయాసం చేసే అస్త్రాలుగా మారుతాయి. ” అని గ్యారీ కీర్ స్టెన్ వివరించారు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సాహా చెలరేగి 57 బంతుల్లో 67 రన్స్ చేశాడు. దీంతో 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ గెలుపొందడం సులువైంది. 19.1 ఓవర్ల లో 3 వికెట్లను కోల్పోయి 134 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ఛేదించింది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడైన కీర్ స్టెన్ గతంలో భారత జట్టుకు సైతం కోచ్ సేవలు అందించారు.