Site icon HashtagU Telugu

Dhruv Jurel: ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడని ఆటగాడికి టీమిండియాలో చోటు.. ఎవరంటే..?

Dhruv Jurel

Safeimagekit Resized Img 11zon

Dhruv Jurel: భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి 2 మ్యాచ్‌ల కోసం జట్టును విడుదల చేశారు. భారత జట్టును బీసీసీఐ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ టీమ్‌లో భారత స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌కు చోటు దక్కుతుందని అంతా భావించారు.  అయితే ఇషాన్ పేరు మాత్రం జట్టులో చేర్చలేదు. మరోవైపు ధృవ్ జురెల్‌ (Dhruv Jurel)ను టెస్టు సిరీస్‌లో చేర్చి బీసీసీఐ అందరినీ ఆశ్చర్యపరిచింది.

జురెల్‌ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు

ధృవ్ జురెల్ అనే పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అతను ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అకస్మాత్తుగా భారత జట్టులోకి వచ్చిన ధృవ్ జురెల్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ధ్రువ్ జురెల్ 22 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ ఆడుతున్నాడు. ఈ ఆటగాడు 2021లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.

గత ఐపీఎల్‌లో 152 పరుగులు చేశాడు

రాజస్థాన్ రాయల్స్ 2022లో రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌తో ప్లేయర్‌ని కొనుగోలు చేసింది. గతేడాది ఐపీఎల్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో 152 పరుగులు చేశాడు. ఈ పరిస్థితిలో జురెల్‌ కి ఐపిఎల్‌లో లేదా దేశవాళీ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదిలావుండగా ఇంగ్లండ్ వంటి పెద్ద జట్టుతో తలపడే భారత జట్టులో అతనికి చోటు దక్కింది.

భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు భారత జట్టును వెల్లడించింది. బీసీసీఐ శుక్రవారం భారత జట్టును విడుదల చేసింది. విశేషమేమిటంటే.. నేటికీ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడని ఆటగాడు ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఏ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారో ఒకసారి చూద్దాం.

Also Read: Mahesh Babu : ఇంగ్లీష్ లెటర్స్‌లో.. ఆల్మోస్ట్ అన్ని అక్షరాలపై యాడ్స్ చేసేసిన మహేష్.. రికార్డ్ సెట్..

భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అవేష్ ఖాన్

We’re now on WhatsApp. Click to Join.

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 6 మధ్య జరగనుంది. ఇది కాకుండా మూడవ మ్యాచ్ ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి 19 వరకు జరగనుంది. నాలుగో మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు జరగనుంది. సిరీస్‌లో ఐదవ, చివరి మ్యాచ్ మార్చి 7 నుండి మార్చి 11 మధ్య జరుగుతుంది.