Site icon HashtagU Telugu

Umran@153kmph: ఏమన్నా యార్కరా అది… సాహాకు దిమ్మ తిరిగింది

Umran Malik

Umran Malik

ఫాస్ట్ బౌలర్ కు ఉన్న ఒక ఆయుధం యార్కర్…ప్రత్యర్ధి జట్టు బ్యాటర్ కు బంతి ఆడే అవకాశం ఇవ్వకుండా రెప్ప పాటులో క్లీన్ బౌల్డ్ చేయడం..గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఒక అద్భుతమైన యార్కర్ తో వృద్ధిమాన్ సాహ కు షాక్ ఇచ్చాడు. దాదాపు 152.8 కిలో మీటర్ల వేగంతో వచ్చిన ఈ బంతిని ఆడేందుకు కూడా సాహా కు వీలు చిక్కలేదు. మిల్లీ సెకన్ల వ్యవధిలో వికెట్లను గిరాటేసింది. దీంతో క్రీజులో ఉన్న సాహా కు దిమ్మ తిరిగి పోయింది.

స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు కామెంటేటర్లు అందరూ షాక్ కు గురయ్యారు. వరుస బౌండరీలు కొడుతూ జోరు మీదున్న సాహని పెవిలియన్ కి పంపిన ఉమ్రాన్ సన్ రైజర్స్ కు బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో మొత్తం అయిదు వికెట్లు పడగొట్టిన ఈ యువ పేసర్ బౌలింగ్ లో సాహా క్లీన్ బౌల్డ్ హైలైట్ గా నిలిచింది. తన ప్రతి ఓవర్లో ఉమ్రన్ మాలిక్ వికెట్ పడగొట్టడం విశేషం. గిల్ , హార్ధిక్ పాండ్య , మిల్లర్ లని ఔట్ చేశాడు. చివర్లో అభినవ్ మనోహర్ నీ క్లీన్ బౌల్డ్ చేసిన ఉమ్రాన్ ఐపీఎల్ కెరీర్లో తొలిసారి అయిదు వికెట్ల ప్రదర్శన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అయిదు వికెట్లలో నలుగురిని క్లీన్ బౌల్డ్ చేయడం మరో రికార్డ్. గతంలో మలింగ , సిద్ధార్థ్ త్రివేది మాత్రమే ఈ రికార్డు సాధించారు.

Pic Courtesy- IPL/Twitter

Exit mobile version