Site icon HashtagU Telugu

Umran Malik: ఉమ్రాన్ మాలిక్ సంచలనం..తన రికార్డు తానే బద్దలు కొట్టిన యువ క్రికెటర్..!!

Umran Malik

Umran Malik

కశ్మీర్ యువ సంచలనం…ఉమ్రాన్ మాలిక్ మరోసారి పంజా విసిరారు. తన రికార్డును తానే బద్దలుకొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తో SRH బౌలర్ ఉమ్రాన్ మాలిక్ IPA 2022 సీజన్ లోనే అత్యంత స్పీడ్ బాల్ ను సంధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ లో నాలుగో బాల్ ను గంటకు 157కిమి స్పీడ్ తో విసిరాడు. అయితే అంతకుముంద CSKతో మ్యాచ్ లో గంటకు 154కి.మీ వేగంతో బంతిని విసిరాడు. తాజాగా తన రికార్డును తానే బద్దలు కొట్టాడు ఈ యువ క్రికెటర్. సరికొత్త చరిత్రను సృష్టించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు టాప్ ఐదు ఫాస్టెస్ట్ డెలివరీల్లో నాలుగు ఉమ్రాన్ మాలిక్ పేరిటే ఉన్నాయి. ఇప్పటి వరకు 9 మ్యాచ్ లు ఆడిన ఉమ్రాన్ 7 మ్యాచుల్లో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డులను గెలుచుకోవడం విశేషమనే చెప్పాలి.

ఇక IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన లిస్టులో షార్ టైన్ తొలిస్థానంలో ఉన్నాడు. 2011 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున షాన్ టైన్…ఢిల్లీ డేర్ డెవిల్స్ తో మ్యాచ్ లో గంటకు 157.71కిలోమీటర్ వేగంతో సంధించాడు. తాజాగా ఉమ్రాన్ మాలిక్ 157కి.మీ స్పీడ్ తో బంతిని విసిరి రెండో స్థానానికి చేరుకున్నాడు. అన్ రిచ్ నోర్ట్జే 156.22, 154.74 మూడో స్థానంలో ఉండగా…డేల్ స్టెయిన్ 154.4 కి.మీ వేగంతో నాలుగో స్థానంలో కగిసో రబాడ 154.23 కి.మీ స్పీడ్ తో ఐదో స్థానంలో ఉన్నాడు.

Exit mobile version