Site icon HashtagU Telugu

Umpire Nitin Menon: పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాక‌రించిన భారత అంపైర్.. రీజ‌న్ ఇదే!

Umpire Nitin Menon

Umpire Nitin Menon

Umpire Nitin Menon: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. అయితే ఈ టోర్నీ నుంచి తప్పిస్తూ భారత అంపైర్ నితిన్ మీనన్ (Umpire Nitin Menon) పేరు లేకుండా ఐసీసీ అంపైర్ల జాబితా విడుద‌ల చేసింది. అయితే నితిన్ కూడా టీమిండియా బాట‌లోనే ప్ర‌యాణిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంపైరింగ్ కోసం పాక్ వెళ్ల‌లేన‌ని నితిన్ ఐసీసీకి చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత అంపైర్ నితిన్ మీనన్ పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించాడు. నివేదికల ప్రకారం.. నితిన్ మీనన్ పాకిస్తాన్ వెళ్ళడానికి నిరాకరించడంతో అతను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం విడుదల చేసిన అంపైర్ల జాబితాలో చేర‌లేదు. అతడి కంటే ముందు భారత జట్టు కూడా పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించింది. ఇప్పుడు నితిన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో పీసీబీకి గట్టి దెబ్బే తగిలింది.

Also Read: Teenmaar Mallanna : కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా ..? – తీన్మార్ మల్లన్న

పాకిస్థాన్ వెళ్లేందుకు ఎందుకు నిరాకరించాడంటే?

బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ సమాచారం ఇచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల భారత అంపైర్ నితిన్ మీనన్ పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించినట్లు నివేదికలో పేర్కొంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో ఉన్న ఏకైక భారతీయ అంపైర్ నితిన్ మీన‌న్ కావ‌డం విశేషం. నితిన్ పాక్ వెళ్లేందుకు నిరాక‌రించ‌డంతో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ అంపైర్ల జాబితాలో నితిన్ పేరు లేకుండానే విడుదల చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు అంపైరింగ్‌గా కనిపిస్తార‌నేది ఐసీసీ విడుద‌ల చేసిన జాబితాలో స్ప‌ష్టంగా ఉంది. ఈ జాబితాలో 12 మంది అంపైర్లు, 3 మ్యాచ్ రిఫరీల పేర్లను ప్రకటించారు. ఇందులో భారతీయులెవరూ చేరలేదు.

ఛాంపియన్స్ ట్రోఫీలో అంపైర్లు: కుమార్ ధర్మసేన, క్రిస్ గాఫ్నీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, అహ్సన్ రజా, పాల్ రీఫిల్, షరాఫుద్దౌలా ఇబ్న్ షాహిద్, రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ వార్ఫ్,

మ్యాచ్ రిఫరీలు: డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్